ఏదో ఒక సందర్భంలో మన వద్ద డబ్బు ఉండదు.కానీ చాలా పెద్ద అవసరం ఏర్పడుతుంది.బంధువులనో, స్నేహితులనో అడిగినా వారి నుంచి సహాయం అందదు.దీంతో ఏం చేయాలో దిక్కు తోచని పరిస్థితి.ఇటువంటి పరిస్థితుల్లో ఆన్‌లైన్ లోన్ యాప్‌లు చక్కటి పరిష్కారంగా ఉంటున్నాయి.అయితే కొన్ని లోన్ యాప్‌లు ప్రజలను పీడించుకుని తింటున్నాయనే ఆరోపణలు ఉన్నాయి.
అయితే కొన్ని నమ్మకమైన లోన్‌యాప్ లు కూడా ప్రజల మన్ననలను పొందాయి.ప్రస్తుతం డిజిటల్ పేమెంట్ సిస్టమ్ బాగా ప్రాచుర్యం పొందిన తర్వాత ఫోన్ పే అగ్రగామిగా కొనసాగుతోంది.
తన యూజర్లకు అద్భుతమైన ఆఫర్ అందిస్తోంది.

రూ.5 లక్షల లోన్ పొందే అవకాశాన్ని కల్పిస్తోంది.అయితే నేరుగా అందించకుండా వివిధ ఫిన్ టెక్ సంస్థల ద్వారా ఈ ఆఫర్ అందుబాటులోకి తెచ్చింది.
దీనికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.గూగుల్ పే, పే టీఎం వంటివి వివిధ ఫిన్ టెక్ సంస్థల ద్వారా లోన్‌లను తమ యూజర్ల కోసం అందుబాటులోకి తీసుకొచ్చాయి.
వాటిపై ప్రజలకు నమ్మకం ఏర్పడింది.అయితే అత్యధిక యూజర్లు ఉన్న ఫోన్ పే మాత్రం తాజాగా అదే తరహాలో ప్రజలకు లోన్ అందిస్తోంది.మనీ వ్యూ, బడ్డీ లోన్స్ కంపెనీల ద్వారా రూ.5 లక్షల వరకు లోన్‌ను క్షణాల్లో పొందే వీలు కల్పిస్తోంది.

ఫోన్ పే ప్రమోట్ చేస్తుండడంతో వాటిపై ప్రజలకు మరింత నమ్మకం పెరిగింది.దీంతో చాలా మంది తమ అవసరాల కోసం ఆయా సంస్థల నుంచి లోన్‌లు పొందుతున్నారు.తొలుత ఫోన్ పే యాప్ ఓపెన్ చేయాలి.పైన మీకు మనీ వ్యూ, బడ్డీ లోన్ యాప్‌ల ప్రకటనలు కనిపిస్తాయి.వాటిలో మీకు నచ్చిన దానిని ఓపెన్ చేస్తే ఆయా సంస్థల వెబ్ సైట్ కనిపిస్తుంది.దానిలోకి వెళ్లి మీ వివరాలను అందించాలి.
సిబిల్ స్కోరు వంటివి చెక్ చేసి, మీకు ఎంత వరకు లోన్ పొందే అర్హత ఉందో అవి చూపిస్తాయి.బ్యాంకు ఖాతా నంబరుకు మీ సమ్మతి తర్వాత డబ్బులు జమ చేస్తాయి.
