సరికొత్త ఫీచర్‌ ను విడుదల చేసిన ఫోన్ పే..!

టెక్నాలజీ పరంగా రోజురోజుకి ఏదో ఒక అప్డేట్ వస్తూనే ఉంటుంది.ప్రజలకు సౌకర్యాలను మరింతగా చేకూర్చేందుకు అనేక టెక్నాలజీ సంస్థలు రోజురోజుకీ కొత్త ఆలోచనలతో ముందుకు సాగుతూ ఉంటాయి.

 Phone Pay Introduces New Feature Auto Top Up In Its Latest Version,  Phone Pay,-TeluguStop.com

ఇందులో భాగంగానే ప్రతిరోజు మనం ఉపయోగించే అనేక యాప్స్ వారి అప్ డేట్స్ తో ప్రజలకు మరింత చేరువయ్యేలా ప్రయత్నిస్తుంటాయి.ఇందులో భాగంగానే తాజాగా ప్రముఖ డిజిటల్‌ పేమెంట్‌ ప్లాట్‌ ఫామ్‌ ఫోన్‌ పే కొత్త ఫీచర్‌ లను అందుబాటులోకి తీసుకు రాబోతుంది.

ఇందుకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే.

ఫోన్​ పే వాలెట్ ఆటో టాప్​ అప్ అనే కొత్త ఫీచర్‌ ను అందుబాటులోకి తీసుకువచ్చింది.

దీనిని యూపీఐ విధానాన్ని అనుసరించి ఈ కొత్త ఫీచర్​ ను రోలవుట్​ చేస్తోంది ఫోన్ పే.ముఖ్యంగా ఈ ఫఫీచర్ సదుపాయం ద్వారా కస్టమర్లు వారి ఫోన్‌ పే వాలెట్‌ ను అతి సులభంగా రీఛార్జ్​ చేసుకునే వెసులుబాటు కలిపించ బోతుంది.ఒకవేళ ఫోన్​ పే వాలెట్​ లో అమౌంట్​ లేనట్లయితే ఆటోమేటిక్​ గా బ్యాలెన్స్​ లోడ్ చేసుకోబడుతుంది.దాంతో, ఫోన్‌ పే కస్టమర్లు ప్రతి ఒక్కసారి వారి ఫోన్ పే వాలెట్​ ను మాన్యువల్‌ గా లోడ్‌ చేసే ఇబ్బందులు తప్పుతాయి.

Telugu Auto Top, Ups, Phone Pay-Latest News - Telugu

అంతే కాకుండా ఈ ఆటో టాప్ అప్ ఆప్షన్ వినియోగదారుల సమయాన్ని చాలా ఆదా చేస్తుంది.ఎక్కువ ప్రాసెస్ లేకుండా సులభంగా వాలెట్ లోడ్​ చేస్తుంది.అయితే యూపీఐ ఈ-మ్యాన్​​ డేట్ సెటప్​ చేసిన తదుపరి, ఆ కస్టమర్లు తమ వాలెట్‌ ను లోడ్ చేయాలనుకున్న లేదా చెల్లింపులు చేయాలనుకున్న ప్రతిసారీ యూపీఐ పిన్ అసలు ఎంటర్ చేయాల్సిన అవసరం ఉండదు.ఆ తర్వాత వచ్చే ఓటిపి కోసం కూడా వేచి ఉండాల్సిన అవసరం అంతకన్నా లేదు.

వారి ఫోన్ పే వాలెట్​ బ్యాలెన్స్ సున్నకు పడిపోయినప్పుడు ఆటోమేటిక్​ గా ఫోన్ పే రీఛార్జ్​ చేస్తుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube