వైసీపీని ఇబ్బంది పెడుతున్న ఫోన్ లీకులు.. తాజాగా మ‌రో మంత్రి..

ఈ మ‌ధ్య‌ రెండు తెలుగు రాష్ట్రాల్లో మంత్రుల ఫోన్ లీకులు అటు టీఆర్ ఎస్‌ను, ఇటు వైసీపీని ఇబ్బందులు పెడుతున్నాయి.ఎవ‌రో ప్లాన్ చేసిన‌ట్టు ఇలా మంత్రుల ఫోన్ లీకులు కావ‌డంతో అంతా త‌ల‌లు ప‌ట్టుకుంటున్నారు.

 Phone Leaks Bothering Ycp Another Minister Gummanuru Jayaram Recently, Ycp, Mini-TeluguStop.com

ఇవి కాస్త రెండు పార్టీల ఇమేజ్‌ను డ్యామేజ్ చేసే విధంగా ఉంటున్నాయి.ఇక ఇప్పుడు ఏపీలో మ‌రో మంత్రి ఫోన్ లీక్ కావ‌డంతో వైసీపీలో పెద్ద దుమారమే రేగుతోంది.

ఆయ‌నెవ‌రో కాదు మంత్రి గుమ్మనూర్ జయరామ్.ప్ర‌స్తుతం ఏపీలో సుక అక్రమ రవాణాకు చెక్ పెట్టేందుకు ప్ర‌భుత్వం ప్ర‌య‌త్నిస్తోంది.

ఇలాంటి నేప‌థ్యంలో తాజాగా మంత్రి ఫోన్ లీకులో ఆయ‌న అక్ర‌మ ఇసుక రవాణాకు సహకరించారనే వార్త హాట్ టాపిక్ గా మారింది.అస‌లు ఇందులో ఏముందంటే ఇసుక అక్రమ రవాణా గురించి ఆయ‌న నియోజ‌క‌వ‌ర్గంలో ఉండే ఓ పోలీస్ ఆఫీస‌ర్ తో మంత్రి జయరామ్ మాట్లాడారు.

ఇల్లీగల్ గా ప్రుభుత్వం ఇసుక ర‌వాణా వద్దని చెప్పినా కూడా లీగల్ గా ఇసుక రవాణా చేసుకోవాలని చెప్పినట్లు ఎస్ఐ చెప్ప‌డం పెద్ద సంచ‌ల‌న‌మే రేపుతోంది.ఇక ఆయ‌న మాట‌ల‌కు మంత్రి జయరామ్ ఎస్ఐపై సీరియస్ అవుతూ నువ్వు ఎందుకు ప‌ట్టుకున్నావ‌ని, వెంటేన పట్టుకున్న ఇసుక ట్రాక్టర్లను వదిలేయాలంటూ ఆవేశంగా మాట్లాడారు.

Telugu Ap, Jagan, Jayaram, Sand Transport, Ycp-Telugu Political News

వ‌ద‌ల‌క పోతే గ‌న‌క వెంట‌నే కార్య‌క‌ర్త‌ల‌తో ధర్నాకు దిగుతానంటూ చెప్ప‌డం ఇప్పుడు సోషల్ మీడియాలో విప‌రీతంగా వైరల్ కావ‌డంతో అటు ప్ర‌తిప‌క్షాలు భ‌గ్గుమంటు్నాయి.పైకేమో ప్రభుత్వం ఇసుక అక్రమాలను సహించేది లేదని చెబుతూనే ఇలా మంత్రులు ప్ర‌భుత్వంలో ఉండి కూడా ఇలాంటి మాట‌లు మాట్లాడ‌ట‌మేంట‌ని వాపోతున్నారు.సాక్షాత్తూ మంత్రే ఇలాంటి వ్యాఖ్య‌లు చేస్తున్నారంటే అక్రమార్కులను వీరే ప్రోత్సహించేలా వ్యవహరిస్తున్నార‌ని పెద్ద ఎత్తున విమర్శలు రావ‌డం వైసీపీకి పెద్ద‌ త‌ల‌నొప్పిగా మారింది.మిర జ‌గ‌న్ ఇలాంటి వాటిపై ఎలా స్పందిస్తారో చూడాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube