సిగ్నల్స్ లేకున్నా ఫోన్ కాల్స్ మాట్లాడొచ్చు.. ఈ సెట్టింగ్ మారిస్తే సరి..!

ఈ రోజుల్లో అన్ని టెలికాం కంపెనీల నెట్‌వర్క్‌ సిగ్నల్స్ సరిగా అందుబాటులో ఉండటం లేదు.పేలవమైన సిగ్నల్స్ కారణంగా ఫోన్ కాల్స్ కలవకపోవడం.

 Phone Calls Can Be Made Without Signals .. It Is Ok To Change This Setting ..! M-TeluguStop.com

ఫోన్ కాల్స్ కలిసినా మధ్యలోనే డిస్‌కనెక్ట్ అయిపోవడం.అవతల వ్యక్తి మాటలు సరిగా వినిపించకపోవడం వంటి సమస్యలు అందరూ ఎదుర్కునేవే.

ఈ సమస్యలు అప్పుడెప్పుడు తలెత్తుతుండటం సర్వసాధారణమైపోయింది.ఐతే ఈ సమస్యలన్నిటికీ వైఫై కాలింగ్ చెక్ పెడుతుంది.

వై-ఫై కాలింగ్ ఆన్ చేస్తే చాల .నెట్‌వర్క్ సిగ్నల్స్ సరిగ్గా లేకున్నా లేదా వీక్ గా ఉన్నా.మీరు కాల్స్ మాట్లాడుకోవచ్చు.

వై-ఫై కాలింగ్ ఫీచర్ సాయంతో చేసిన ఫోన్ కాల్స్ డిస్‌కనెక్ట్ అవ్వవు.

అంతేకాకుండా కాల్ మాట్లాడేటప్పుడు అవతలి వ్యక్తి వాయిస్ చాలా స్పష్టంగా వినిపిస్తుంది.మనం వైఫై కాలింగ్ వినియోగించినప్పటికీ.

కంపెనీలు ఎలాంటి అదనపు రుసుము వసూలు చేయవు.కావున మీరు ఈ అత్యంత ఉపయోగకరమైన ఫీచర్ గురించి తప్పక తెలుసుకోవాలి.

Telugu Phone, Singals, Ups-Latest News - Telugu

ఈ ఫీచర్ ఎలా యాక్టివేట్ చేయాలో తెలుసుకుంటే.ఆండ్రాయిడ్ ఫోన్‌లోని సెట్టింగ్స్‌లోకి వెళ్లి నెట్‌వర్క్ కనెక్షన్ఆ ప్షన్ పై నొక్కాలి.తరువాత వై-ఫైఆప్షన్ పై క్లిక్ చేసి అడ్వాన్స్ ఆప్షన్ ను సెలెక్ట్ చేసుకోవాలి.అప్పుడు మీ స్క్రీన్ పై “వై-ఫై కాలింగ్” అనే ఆప్షన్ కనిపిస్తుంది.

దీనిని యాక్టివేట్ చేసుకుంటే సరిపోతుంది.మీ ఫోన్‌లో ఉన్న 2 సిమ్స్ లో మీకు నచ్చిన సిమ్ నుంచి వైఫై కాలింగ్ యాక్టివేట్ చేసుకోవచ్చు.

Telugu Phone, Singals, Ups-Latest News - Telugu

ఐఫోన్ యూజర్లు కూడా తమ ఫోన్ సెట్టింగ్స్‌లోకి వెళ్లి “డేటా” అనే ఆప్షన్ ఎంచుకొని ఆపై వైఫై కాలింగ్ ఫీచర్ ఎనేబుల్ చేసుకోవచ్చు.వైఫై కాలింగ్ ఫీచర్ అనేది ఐపీ టెక్నాలజీ ఆధారంగా పనిచేస్తుంది.సెల్లులార్ సిగ్నల్స్ లేకపోయినా ఇది ఇంటర్నెట్ కనెక్షన్ ద్వారా కాల్స్ మాట్లాడుకోవడానికి అనుమతిస్తుంది.ఇంటర్నెట్ ద్వారా కాల్స్ కనెక్ట్ అవుతాయి కాబట్టి వాయిస్ లో ఎలాంటి అంతరాయం లేకుండా మాట్లాడుకోవచ్చు.

ఈ ఫీచర్ యూజ్ చేసి వాయిస్ కాల్స్ తో పాటు వీడియో కాల్స్, మెసేజ్ లు కూడా పంపించవచ్చు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube