ఇటీవలే కాలంలో సినిమాలలో కూడా చూడనటువంటి దారుణమైన ఘటనలు చూస్తున్నాం.అవి వింటేనే కంపరం పుడుతుంది.
ఇంకా ఇప్పుడు కూడా అలాంటి కంపరం పుట్టే ఘటన ఫిలిప్ లో చోటుచేసుకుంది.ప్రాంతీయ భాషపై ఎంత ప్రేమ ఉన్న మనం బ్రతకాలంటే ఇంగ్లీష్ తప్పనిసరి.
ఈ కాలంలో ఇంగ్లీష్ భాష రాకపోతే చాలా కష్టం.
అలా అని భాష రాకపోతే బతకలేం అని కాదు.
ఆ భాషా వస్తే జీవితంలో ముందుకు వెళ్ళడానికి సులువవుతుంది.ఇంకా అలాంటి ఇంగ్లీష్ లో నాలుగు ముక్కలు గలగలా మాట్లాడిందనే కారణంతో ఓ వ్యక్తి మహిళను అతికిరాతంగా చంపి తలను, శరీరాన్ని వేరు చేసి వేరువేరు ప్రదేశాల్లో పడేశాడు.
అయితే మురికి కాలువలో ఆ బాడీని గుర్తించిన పోలీసులకు ఆ బాడీ ఎవరిది అనేది కనుక్కోవడం కష్టంగా మారింది.
దీంతో కుక్కలను సంఘటన స్థలానికి తీసుకెళ్లగా కుక్కలు 4 కి.మీ.దూరంలో ఉన్న ఇంటికి పరుగులు తీశాయి.ఇంకా ఆ ఇంటికి తాళం వెయ్యడంతో పక్కన ఇంటి వారిని అతని గురించి కనుక్కోగా అతను కొన్ని రోజుల క్రితమే హడావుడిగా అక్కడనుండి వెళ్ళిపోయినట్టు వారు చెప్పారు.దీంతో పోలీసులు అతని కోసం గాలించగా ఎట్టకేలకు అతను దొరికాడు.
ఆమెను చంపింది అతడే అని ఒప్పుకున్నాడు.కానీ ఎందుకు చంపావు అని ప్రశ్నించగా అతడు చెప్పిన సమాధానం విని పోలీసులు షాక్ అయ్యారు.
అతను ఇలా చెప్పాడు.ఆమె ఎవరో అతనికి తెలియదని, అతనితో ఇంగ్లీష్‌లో మాట్లాడిందని ఆ భాష అంటే అతనికి నచ్చక చంపేసినట్టు చెప్పాడు.
అనంతరం పక్కనే ఉన్న గార్డెన్ కత్తెరతో తలను వేరు చేసినట్టు ఆకలిగా ఉండడంతో ఆమె తలలోని మెదడును వేరు చేసి వండుకొని అన్నంలో తిన్నట్టు చెప్పాడు.ఇది విన్న పోలీసులు కొందరు షాక్ అయితే మరికొందరు వాంతులు చేసుకున్నారు.