షియోమీ కంపెనీ ఉత్పత్తుల తయారీ, అమ్మకం ఆపేయాలని పిటిషన్‌ వేసిన ఫిలిప్స్..!

మొబైల్ రంగంలో దిగ్గజం అయిన షియోమీ సంస్థకు తాజాగా షాక్ తగిలింది.చైనా దేశానికి చెందిన మొబైల్స్ తయారీ సంస్థకు సంబంధించి అన్ని రకాల ఉత్పత్తుల తయారీ, అలాగే దిగుమతులను, వాటితో పాటు ఆ కంపెనీకి చెందిన అమ్మకాలను కూడా నిలిపివేయాలంటూ ప్రముఖ ఎలక్ట్రానిక్స్ దిగ్గజ కంపెనీ అయిన ఫిలిప్స్ భారతదేశ రాజధాని ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.

 Philips Petitions To Stop Production And Sale Of Xiaomi Products, Xiaomi , Compa-TeluguStop.com

ఈ పిటిషన్ లో తమ కంపెనీకి చెందిన పలు పేటెంట్లను షియోమి సంస్థ ఉల్లంఘించిందని ఆరోపిస్తూ ఫిలిప్స్ కంపెనీ కోర్ట్ లో పిటిషన్ దాఖలు చేసింది.ఇందులో భాగంగానే షియోమీ సంస్థకు చెందిన ఉత్పత్తుల తయారీ, అడ్వర్టైజ్మెంట్లు, దిగుమతి, అసెంబ్లింగ్ లాంటి ప్రక్రియను పూర్తిగా నిలిపివేయాలని హైకోర్టులో వేసిన పిటిషన్ ను ఫిలిప్స్ కోరింది.

ఫిలిప్స్ సంస్థకు చెందిన HSPA, HSPA ప్లస్, LTE టెక్నాలజీ లకు చెందిన కొన్ని పేటెంట్లను షియోమీ సంస్థ ఉల్లంఘించినట్లు అందులో ఆరోపించింది.

ఈ పిటిషన్ సంబంధించి తాజాగా కోర్టు స్పందించింది.

షియోమీ సంస్థకు చెందిన బ్యాంకులలో దాదాపు వెయ్యి కోట్ల నగదు నిల్వలను కచ్చితంగా మెయింటైన్ చేయాలని సంస్థకు ఆదేశాలు జారీ చేసింది.అయితే ఈ కేసు విచారణకు సంబంధించి కేసును జనవరి 18, 2021 కు వాయిదా వేసింది.

చూడాలి మరి ఆ రోజు షియోమి సంస్థపై హైకోర్టు ఎలాంటి సంచలన నిర్ణయం తీసుకుంటుందో.ఫిలిప్స్ సంస్థ కోర్టులో కేసును ఫైల్ చేయడమే కాకుండా సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఎక్సైజ్ అండ్ కస్టమ్స్ కు కూడా ఓ పిటిషన్ అందజేసింది.

ప్రస్తుతం షియోమీ సంస్థ ఆరోపణలు అందుకోవడం చర్చనీయాంశంగా మారిపోయింది.ఈ సమస్యకు సంబంధించి షియోమీ సంస్థ అధికారులను వివరణ కోరగా షియోమీ అధికారులు ఎటువంటి స్పందన ఇవ్వలేదు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube