కువైట్ వలస కార్మికులకి...భారీ దీక్బ్రాంతి

దేశం కాని దేశం విడిచి నాలుగు డబ్బులు ఎక్కువగా సంపాదించుకోవడానికి అప్పలు చేసుకుని మరీ ఎంతో మంది ఎన్నారైలు.వలస కార్మికులు, దుబాయ్ కంట్రీస్ కి వెళ్తూ ఉంటారు.

 Philippines Says More Than 2200 Citizens In Kuwait Want To Go Home-TeluguStop.com

కువైట్ లాంటి ప్రదేశాలకి వెళ్ళే వారిలో ఎక్కువమంది భారతీయులు ఉండటం ఇక్కడ ముఖ్యంగా గమనించవలసిన అంశం.అయితే ఇటీవల అమెరికా లాంటి అగ్రరాజ్యం పెట్టిన ఆంక్షలకే ఎంతో మంది ఎన్నారై లు ముఖ్యంగా భారతీయులు ఎన్నో అవస్థలు పడుతుండగా తాజాగా గల్ఫ్ దేశాలు కూడా ఆంక్షలు పెట్టడం ఎంతో మంది భారతీయులని ఆందోళనకి గురిచేస్తోంది.

రెండు నెలల క్రితమే గల్ఫ్ కంట్రీస్ లో పని చేస్తున్న వలసకార్మికుల కాంట్రాక్ట్‌లను రద్దు చేయాలని కువైట్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుని ఆ విధానం త్వరలో అమలు చేస్తామని ఓ ప్రకటనలో తెలిపింది అయితే ఇప్పుడు తాజాగా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని అమలు చేస్తూ ఆదేశాలు జారీ చేసింది.సివిల్ సర్వీస్ కమిషన్ అహ్మద్ అల్ జాసర్ పేరుతో ఉత్తర్వులు కూడా విడుదలయ్యాయి.

దాదాపు కువైట్‌లో 3,140 మంది వలసకార్మికులు పబ్లిక్ సెక్టర్ రంగంలో పనిచేస్తున్నారు అయితే ఇప్పుడు తక్షణమే వారిని ఉద్యోగాల నుంచీ తొలగించాలని ఆ ఉత్తర్వుల్లో పేర్కొంది కువైట్ ప్రభుత్వం.కువైట్‌లో పెరిగిపోతున్న వలసకార్మికుల సంఖ్యని తగ్గించడానికి ఈ చర్యలకి ప్రభుత్వం పాల్పడి ఉండవచ్చునని నిపుణులు అంచనా వేస్తున్నారు.మరి ఈ సంక్షేభం లో ఎంతో మంది వలస కార్మికులు ముఖ్యంగా భారత్ నుంచీ వచ్చిన వారు ఎలా ఈ పరిస్థితులని ఎదుర్కోవాలో అంటూ ఆందోళన చెందుతున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube