తుఫాన్ ఎఫెక్ట్ : అమలాపురంలో చేపల వర్షం

కోస్తాను అతలాకుతలం చేస్తున్న పెథాయ్ తుఫాన్ ధాటికి జనజీవనం అల్లల్లాడిపోతున్నారు.వర్షాలకు తోడు బలమైన చలిగాలులు వీస్తుండడంతో… ఇప్పటికే తొమ్మిది మంది వరకు మృతిచెందినట్టు సమాచారం.

 Phethai Cyclone Effect Fish Raining At Amalapuram1-TeluguStop.com

ఇక పశువులు, గొర్రెలు పెద్ద సంఖ్యలో మరణించాయి.అయితే ఈ తుఫాన్ లో మరో విచిత్రం కూడా చేటు చేసుకుంది.

అందేంటి అంటే…? తూర్పు గోదావరి జిల్లా అమలాపురంలో తుఫాన్, ఈదురు గాలులకు పట్టణంలో చేపల వర్షం కురిసింది.

అమలాపురంలోని మున్సిపల్‌ పాఠశాల ప్రాంగణంలో వర్షంతో పాటు చేప పిల్లలు కూడా కురిశాయి.దీంతో విద్యార్థులు, స్థానికులు ఆ చేపపిల్లలను పట్టుకునే ప్రయత్నం చేస్తూ ఉల్లాసంగా గడిపారు.బలమైన తుఫాన్‌కు వాయుగుండం కూడా తోడైనప్పుడు ఇలా చేపల వర్షం కురుస్తుందని నిపుణులు చెబుతున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube