కరోనా టీకా అసలు రాకపోవచ్చు అంటున్న ప్రధాని

ప్రపంచ వ్యాప్తంగా కరోనా కరాళ నృత్యం చేస్తున్న ఈ సమయంలో ప్రతి ఒక్కరు కూడా కరోనాకు వ్యాక్సిన్‌ ఎప్పుడు వస్తుందా అంటూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.ఈ సమయంలో పలు అంతర్జాతీయ ఔషద తయారీ సంస్థలు కరోనా టీపై ప్రయోగాలు చేస్తున్నాయి.

 Britan Prime Minister Boris Johnson Comments On Corona Vacine Medicine  Coronavi-TeluguStop.com

ఇప్పటికే కొందరు టీకా అభివృద్దిలో అడుగులు వేశామని అంటున్నారు.ప్రపంచ వ్యాప్తంగా వ్యాక్సిన్‌పై కొత్త ఆశలు చిగురిస్తున్న సమయంలో బిట్రన్‌ ప్రధాని బోరిస్‌ జాన్సన్‌ ఆందోళన కలిగించే వ్యాఖ్యలు చేశాడు.

ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం కరోనాకు వ్యాక్సిన్‌ తయారు చేస్తున్న పలు సంస్థలు కూడా పురోగతిని సాధిస్తున్న దాఖలాలు కనిపించడం లేవన్నాడు.

వ్యాక్సిన్‌ వచ్చేందుకు ఏడాదికి పైగా పట్టవచ్చు లేదా అసలు రాకపోవచ్చు.

ఈ సమయంలో జనాలు జాగ్రత్తలు పాటిస్తూ కరోనాతో సహజీవనం సాగించడం తప్ప మరేం చేయలేము అంటూ ఆయన భయంకరమైన వ్యాఖ్యలు చేశాడు.ఈ సమయంలో ఆయన ఇలాంటి వ్యాఖ్యలు చేయడంతో అంతా కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

అయితే ఔషద సంస్థలు మాత్రం వ్యాక్సిన్‌ తయారికి సంబంధించి పురోగతిని సాధించినట్లుగా చెబుతున్నారు.ట్రైల్స్‌ కూడా ప్రారంభం అయ్యాయి అంటున్నారు.మరి ఈ విషయంలో ఎవరి మాట నమ్మాలో అర్థం కాని పరిస్థితి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube