తమిళనాట ‘పేట’ ఫీవర్‌ ఏ స్థాయిలో ఉందో చెప్పడానికి ఇదో చిన్న ఉదాహరణ  

  • ఇండియన్‌ సూపర్‌ స్టార్‌ రజినీకాంత్‌కు దేశ వ్యాప్తంగా అభిమానులు ఉంటారు. ఇక ఆయనకు తమిళనాట అభిమానులు కాకుండా భక్తులు ఉంటారు. తమిళనాట రజినీకాంత్‌కు ఉన్న అభిమానులు ఏ స్థాయిలో సందడి చేస్తారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

  • Petta Movie Fever Goes In Peaks Tamil Nadu-Petta Petta Review Rajanikanth Rajanikanth Next

    Petta Movie Fever Goes In Peaks In Tamil Nadu

  • ముఖ్యంగా రజినీకాంత్‌ మూవీ విడుదలైన సమయంలో ఆ సందడి అంతా ఇంతా ఉండదు. తాజాగా రజినీకాంత్‌ నటించిన ‘పేట’ చిత్రం విడుదలైంది. తమిళనాడుతో పాటు తెలుగు రాష్ట్రాల్లో కూడా పేట విడుదల అయ్యింది. తెలుగు రాష్ట్రాల విషయాన్ని పక్కన పెడితే తమిళనాట పండగ ముందే వచ్చేసిందా అనిపిస్తుంది.

  • Petta Movie Fever Goes In Peaks Tamil Nadu-Petta Petta Review Rajanikanth Rajanikanth Next
  • రజినీకాంత్‌ నటించిన పేట చిత్రం విడుదలైన ప్రతి ఒక్క థియేటర్‌ వద్ద హంగామా మామూలుగా లేదు. అదిరిపోయేలా థియేటర్ల వద్ద అభిమానులు ఏర్పాటు చేసుకుని, తమకు తాముగా పండుగ చేసుకుంటున్నారు. ఇక పేట సినిమా విడుదలైన ఉడ్స్‌ల్యాండ్‌ ముందు హంగామా మరోలా ఉంది. అక్కడ పెళ్లి వాతావరణం కనిపించింది. థియేటర్‌ ముందు పెళ్లి ఏంటా అంటూ అటుగా వెళ్తున్న వారు చూసి అవాక్కయ్యారు. పెళ్లి వాతావరణం కాదు, నిజంగానే పెళ్లి జరుగుతుంది అక్కడ.

  • తమ అభిమాన హీరో రజినీకాంత్‌ సినిమా విడుదలవుతున్న రోజే మాకు మంచి రోజని, ఆయన ఆశీర్వాదంతోనే తాము సంతోషంగా ఉంటామంటూ పేట విడుదల అవుతున్న థియేటర్‌ ముందు పెళ్లి చేసుకున్నారు. పెళ్లి చేసుకున్న కొత్త జంట వెంటనే పేట సినిమాను చూసి సందడి చేశారు. గుడి ముందు పెళ్లి అంటే ఏదో హడావుడి పెళ్లిలా కాకుండా, పక్కా హిందూ సాంప్రదాయబద్దంగా జరగడంతో పాటు, వచ్చిన వారికి వింధును కూడా ఏర్పాటు చేశారు. మొత్తానికి పెళ్లి హంగామా పూర్తిగా అక్కడ కనిపించింది. ఇలాంటివి ఎన్నో పేట థియేటర్ల ముందు కనిపిస్తున్నాయి. రజినీకాంత్‌ క్రేజ్‌ తమిళనాట ఆ స్థాయిలో ఉందని చెప్పుకోవచ్చు.