ఎస్బీఐ ఆఫర్ : అలా చేస్తే... పెట్రోల్ ఫ్రీ  

Petrol Special Cashback Offer Announced By Sbi-

State Bank of India has announced a bumper offer for its customers. If the first petrol in the bamboo through the Beam card is Rs 100, the petrol will pay 5 liters of petrol free ... SBI announced.

.

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తమ ఖాతాదారుల కోసం ఓ బంపర్ ఆఫర్ ప్రకటించింది. బీమ్ కార్డు ద్వారా బంకుల్లో మొదటిసారి రూ.100 విలువైన పెట్రోల్ కొట్టించుకుంటే. 5 లీటర్ల పెట్రోల్ ఫ్రీగా ఇస్తామంటూ… ఎస్బీఐ ప్రకటించింది. .

ఎస్బీఐ ఆఫర్ : అలా చేస్తే... పెట్రోల్ ఫ్రీ-Petrol Free Special Cashback Offer Announced By Sbi

ఎస్బీఐ కార్డు లేదా భీమ్‌ ఎస్బీఐ పే ద్వారా ఇండియన్ ఆయిల్ ఔట్‌లెట్స్ (IOC) బంకుల్లో పెట్రోల్ కొట్టించుకోవాలి. ఆ తర్వాత 5 లీటర్ల పెట్రోల్ ఉచితంగా పొందవచ్చు. దీని కోసం ఇండియన్‌ ఆయిల్‌కు చెందిన ఏ పెట్రోల్‌ బంకులో అయినా కనీసం రూ.100 విలువైన పెట్రోలు కొనాలి. దీనికి కొన్ని నిబంధలు ఉంటాయి. అవి ఏమిటంటే.

2018 ఏప్రిల్ ఒకటో తేదీ నాటికి 18 సంవత్సరాలు లేదా అంతకన్నా ఎక్కువ వయసున్న భారత పౌరులు మాత్రమే ఈ అవకాశం పొందడానికి అర్హులు.

ఈ ఆఫర్ పొందాలంటే…

ఇండియన్ ఆయిల్ ఔట్ లెట్ల నుంచి రూ.100 విలువైన పెట్రోల్ ను కొనుగోలు చేయాలి. అదీ భీమ్‌, SBI కార్డు ద్వారా మాత్రమే చెల్లింపులు చేయాలి. 12 అంకెల యూపీఐ రిఫరెన్స్ నంబర్ లేదా 6 అంకెల అధికార కోడ్‌ను 9222222084కు పంపాలి. భీమ్‌ ద్వారా చెల్లిస్తే 12 అంకెల రిఫరెన్స్ కోడ్‌, SBI కార్డు ద్వారా చెల్లింపుల విషయంలో ఆరు అంకెల కోడ్‌ను నిర్దేశిత నంబరుకు SMS చేయాలి.ఇలా కొనుగోలు చేసిన ఏడు రోజుల లోపు పంపించాల్సి ఉంటుంది.

ఇలా పంపిన ఎస్సెమ్మెస్ లలో ఎంపిక చేసిన వాటికి 50, 100,150, 200 రూపాయలు స్పెషల్‌ క్యాష్‌ బ్యాక్‌ ఆఫర్‌ కూడా ఉంది. ఒక మొబైల్ నంబర్ నుంచి రెండు సార్లు ఈ ఆఫర్‌ పొందే అవకాశం ఉంటుంది. ఆఫర్‌ ముగిసిన రెండు వారాల్లో విజేతలను ప్రకటిస్తారట.