దడ పుట్టిస్తున్న పెట్రోల్ ధరలు.. పైపైకే.. ?

ఏం ప్రభుత్వాలో ఏమో సామాన్యుడి నడ్ది విరిచేలా ప్రవర్తిస్తున్నాయని అనుకోని కామన్ పీపుల్ ఉండరు.ఎందుకంటే వరసగా నిత్యావసరాల ధరలు గుండెలను దడదడలాడిస్తున్నాయి.

 Petrol-prices-are-skyrocketingpetrol, Diesel, Prices, High Record, Skyrocketing-TeluguStop.com

పెరుగుతున్న ధరల గురించి వింటే సామాన్యుడికి దిక్కుతోచడం లేదట.వచ్చే ఆవేశాన్ని అణుచుకుంటూ, తనను తానే తిట్టుకుంటున్నాడట.

ఎందుకంటే ప్రస్తుతం అన్ని ధరలు కొండెక్కి కూర్చుంటున్నాయి.ఇప్పటికే దేశవ్యాప్తంగా ఇంధన సెగలు పొగలు కక్కుతుండగా, గ్యాస్ ధరలు గజిబిజి చేస్తున్నాయి.

ఇకపోతే ఈ మధ్యకాలంలో ఎన్నడులేనంత వేగంగా పెట్రోల్ ధరలు పెరుగుతున్న విషయ తెలిసిందే.అంతర్జాతీయంగా చమురు ధరలు పెరగడంతో వీటి ధరలు పెంచక తప్పదని చెబుతున్నారు.

Telugu Diesel, Petrol-Latest News - Telugu

ఇకపోతే శుక్రవారం (ఫిబ్రవరి, 5) దేశంలో పెట్రోల్ డీజిల్ ధరలు మరో కొత్త గరిష్ట స్థాయికి చేరుకున్నాయి.ప్రధాన మెట్రో నగరాల్లో పెట్రోల్ ధరలను లీటరుకు 26 నుండి 30 పైసలు పెంచగా, డీజిల్ ధరను 29 నుండి 32 పైసలు పెరిగింది.కాగా తాజా రికార్డు ధరలతో వాహనదారులు బెంబేలెత్తుతున్నారు.

ఇక పెరిగిన ధరలను చూస్తే.ఢిల్లీలో పెట్రోల్ ధర లీటరుకు రూ .86.65 కు పెరిగింది.డీజిల్ లీటరుకు రూ .76 గా ఉంది.హైదరాబాద్‌లో పెట్రోల్ రూ.90, డీజిల్ రూ.84గా ఉంది.అమరావతిలో పెట్రోల్ 93.09, డీజిల్ 86.31 కాగా బెంగళూరులో పెట్రోల్ రూ.89.85, డీజిల్ రూ.81.76.మరియు ముంబైలో పెట్రోల్ రూ.93.49, ఉండగా డీజిల్ రూ.83.99 ఉంది.చెన్నైలో పెట్రోల్ రూ.89 , డీజిల్ రూ.82 .కోలకతాలో పెట్రోల్ రూ.88 డీజిల్ రూ.81 గా ఉన్నాయి.మరి కొన్ని రోజులాగితే సచిన్ సెంచరీలు చేసినట్టుగా చమురు ధర కూడా రూ.100 కు చేరుకోవడం ఖాయమనిపిస్తుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube