రేవంత్‌ జైల్లో ఉంటేనే బెటరా?

టీటీడీపీ ఎమ్మెల్యే, నోటుకు ఓటు కేసులో నిందితుడైన రేవంత్‌ రెడ్డి జైల్లో ఉంటేనే బెటరా? ఆయన లోపల ఉంటేనే టీఆర్‌ఎస్‌కు ఉపశమనంగా ఉంటుందా? అవుననే అనిపిస్తోంది.ప్రస్తుతం బెయిల్‌ మీద రేవంత్‌ రెడ్డికి హైదరాబాదులో ఉంటే వెసులుబాటు కల్పించింది హైకోర్టు.

 Petition To Cancel Tdp Mla Revanth Reddy’s Bail-TeluguStop.com

న్యాయస్థానం ఆంక్షల కారణంగా చాలాకాలం సొంత నియోజకవర్గమైన కొడంగల్లోనే ఉన్న రేవంత్ ఆంక్షలు తొలగించడంతో హైదరాబాదుకు వచ్చేశారు.వచ్చీ రావడంతోనే ముఖ్యమంత్రి కేసీఆర్‌పై విరుచుకుపడ్డారు.

తాను వస్తున్నానని తెలిసి కేసీఆర్‌ చైనాకు పారిపోయారని వాఖ్యానించారు.ఆట కాదు, వేట మొదలైందన్నారు.

సహజంగానే రేవంత్‌ వ్యాఖ్యలపై టీఆర్‌ఎస్‌ నాయకులు చాలామంది ఘాటుగా స్పందించారు.రేవంత్‌ పిచ్చోడని, మతి పోయిందని విమర్శించారు.

ఈ నేపథ్యంలో తెలంగాణ న్యాయవాదుల జేఏసీ ‘రేవంత్‌ రెడ్డి బెయిల్‌ రద్దు చేయండి’ అని హైకోర్టులో పిటిషన్‌ వేసింది.ఆయన బెయల్‌ నిబంధనలు ఉల్లంఘించారని పేర్కొంది.

నోటుకు ఓటు కేసుపై ఎటువంటి వ్యాఖ్యలు చేయకూడదని, దానిపై నోరు విప్పకూడదని హైకోర్టు రేవంత్‌ కు చెప్పంది.ఆయన ఇప్పటివరకు ఈ కేసుపై అసలు మాట్లాడిన దాఖలాలు లేవు.

కాని బెయిల్‌ నిబంధనలు ఉల్లంఘించారని న్యాయవాదుల జేఏసీ ఆరోపిస్తోంది.కొడంగల్‌ నుంచి హైదరాబాద్‌కు రాగానే టీడీపీ కార్యకర్తలు భారీగా ర్యాలీ నిర్వహించారు.

ఈ సందర్భంలోనే రేవంత్‌ కేసీఆర్‌పై విమర్శలు చేశారు.హైకోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో….!

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube