రేవంత్ అరెస్ట్ : హైకోర్టు లో పిటిషన్  

టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ ఈ రోజు తెలంగాణాలో ఈ రోజు ఎన్నికల సభ నిర్వహించబోతున్నారు. అయితే ఈ సభను ఖచ్చితంగా అడ్డుకుంటాము అంటూ…తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి బహిరంగంగా వ్యాఖ్యానించడం…ఆ తరువాత కొడంగల్ బంద్ కి పిలుపునివ్వడం జరిగింది. ఈ నేపథ్యంలో టీఆర్ఎస్ ఈ సభ ఏర్పాటును ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఎట్టి పరిస్థితుల్లో అయినా అక్కడ సభ ఏర్పాటు చేస్తాము అని ప్రకటించింది.

Petition In High Court On Arrest Of Revanth Reddy-

Petition In High Court On Arrest Of Revanth Reddy

దీనిలో భాగంగానే.. టీఆర్ఎస్ పార్టీ రేవంత్ వ్యాఖ్యలపై ఈసీకి ఫిర్యాదు చేసింది. ఈ దీంతో… రేవంత్ రెడ్డిని ఈరోజు తెల్లవారుజామున పోలీసులు అరెస్ట్ చేసి జడ్చర్లకు తరలించారు. అయితే ఈ అరెస్ట్ ను కాంగ్రెస్ తో పాటు ప్రజకూటమిలోని మిగతా పార్టీ నేతలు కూడా ఖండిస్తున్నారు. కేసీఆర్ అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని, ఇది కేసీఆర్ నియంత పాలనకు నిదర్శనమని మండిపడుతున్నారు. హౌస్ అరెస్ట్ చేస్తే సరిపోయేదానికి ఇలా అర్ధరాత్రి తలుపులు పగలగొట్టి అరెస్ట్ చేయడం ఏంటంటూ విమర్శిస్తున్నారు. మరోవైపు ఈ వ్యవహారంను సీరియస్‌గా తీసుకున్న కాంగ్రెస్.. హైకోర్టును ఆశ్రయించి లంచ్‌మోషన్‌ పిటీషన్ దాఖలు చేసింది. దీంతో ఏ క్షణంలో ఏం జరగబోతుందో అనే టెన్షన్ తెలంగాణాలో నెలకొంది.