చలి కాగేందుకు తల్లి, కొడుకులు బొగ్గుల కుంపటి పెట్టుకుంటే.. జూబ్లీహిల్స్‌ లో గుండెలను పిండేసే సంఘటన  

Pethai Effect Kills Mother And Son In Hyderabad-

హైదరాబాద్‌లో దారుణం జరిగింది.గత కొన్ని రోజులుగా తెలుగు రాష్ట్రాలు చల్లగాులకు వణికి పోతున్న విషయం తెల్సిందే.చల్లగాలులతో పెద్ద ఎత్తున ముసలి వారు పిల్లలు ఇబ్బందులు పడుతున్న విషయం తెల్సిందే.

Pethai Effect Kills Mother And Son In Hyderabad--Pethai Effect Kills Mother And Son In Hyderabad-

చల్లగాలుల వల్ల పలువురు మృత్యువాత కూడా పడ్డారు.అయితే హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌లో తల్లి కొడుకులు చలికి తట్టుకోలేక బొగ్గుల కుంపటి పెట్టుకున్నారు.ఆ బొగ్గుల కుంపటి నుండి వచ్చిన పొగతో ఊపిరి ఆడక మృతి చెందారు.

Pethai Effect Kills Mother And Son In Hyderabad--Pethai Effect Kills Mother And Son In Hyderabad-

పూర్తి వివరాల్లోకి వెళ్తే… తూర్పు గోదావరి జిల్లా పిఠాపురంకు చెందిన బుచ్చి వేణి మరియు ఆమె కొడుకు పద్మరాజులు జూబ్లీహిల్స్‌లో రోడ్డు నెంబర్‌ 25లో ఒక ఇంట్లో పని మనుషులుగా ఉంటున్నారు.వీరికి సదరు ఓనరు గెస్ట్‌ హౌస్‌ కేటాయించాడు.వీరు గెస్ట్‌ హౌస్‌లో ఉంటున్నారు.వీరిద్దరు ఇంట్లో పనులు చేసుకుంటూ వస్తున్నారు.ఓనర్స్‌కు చాలా నమ్మకస్తులుగా పేరు పడ్డ వీరు ఇంట్లో మనుషులుగా ఉండేవారు.

తాజాగా పెథాయ్‌ తుఫాన్‌ కారణంగా చల్లగాలులు విపరీతంగా రావడంతో, చలికి తట్టుకోలేక బొగ్గులతో కుంపటి ఏర్పాటు చేసుకున్నారట.బొగ్గుల కుంపటితో కాస్త వేడి అవుదామనుకున్న వారు ఆ బొగ్గుల కుంపటి వల్లే తిరిగి రాని లోకాలకు వెళ్లి పోయి ఉంటారని అంతా అంటున్నారు.

బొగ్గుల కుంపటి వల్ల వారు చనిపోవడం జరిగిందని పోలీసులు కూడా నిర్థారించారు.పొగతో ఊపిరి ఆడకుండా ఉండటం వల్లే వారు చనిపోయినట్లుగా నిర్థారించారు.అత్యంత హృదయ విదారక ఈ సంఘటనలో తల్లి కొడుకులు చనిపోవడంతో స్థానికులు మరియు పిఠాపురంకు చెందిన వారి బంధువులు మిత్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.