30 మంది ప్రాణాలు కాపాడి తాను చనిపోయిన శునకం  

30 మంది ప్రాణాలు కాపాడిన పెంపుడు కుక్క. .

Pet Dog In Uttar Pradesh Saves S Of Over 30 People-

విశ్వాసానికి మారు పేరుగా కుక్కని అందరూ భావిస్తూ ఉంటారు. ఒక మనిషిని నమ్మే బదులు కుక్కని నమ్మితే విశ్వాసంగా పడి ఉంటది అనే మాట చాలా మంది రెగ్యులర్ గా వాడుతూ ఉంటారు. కొన్ని సందర్భాలలో శునకాలు ఆ మాటలు నిజమని రుజువు చేస్తూ ఉంటాయి..

30 మంది ప్రాణాలు కాపాడి తాను చనిపోయిన శునకం-Pet Dog In Uttar Pradesh Saves Lives Of Over 30 People

అందరిని ఆశ్చర్యానికి గురి చేయడంతో పాటు ఆ శునకాల మీద మరింత ప్రేమ పెరిగేలా చేస్తాయి. ఇప్పుడు కూడా ఈ శునకం ఉత్తరప్రదేశ్ లో అలాగే ముప్పై మంది ప్రాణాలు కాపాడింది. ఉత్తరప్రదేశ్‌లోని బాందా ప్రాంతంలో ఓ భవనంలో ప్రమాదవశాత్తూ మంటలు చెలరేగాయి.

ప్రమాదాన్ని పసిగట్టిన శునకం కాసేపటికి వరకు గట్టిగా మొరుగుతూనే ఉంది.

దాని అరుపులు విన్న అక్కడి జనం ఇళ్లలో నుంచి బయటికి వచ్చి చూశారు. భవనంలో భారీ ఎత్తున మంటలు చెలరేగడం గమనించారు.

దీంతో దాదాపు 30 మంది వరకు బయటకు పరుగెత్తి ప్రాణాలు దక్కించుకున్నారు. ఇంత మంది ప్రాణాలు కాపాడిన ఆ శునకం మాత్రం తన ప్రాణాలను కాపాడుకోలేకపోయింది. ఆ మంటల ధాటికి సిలిండర్‌ పేలడంతో దురదృష్టవశాత్తూ ప్రాణాలు కోల్పోయింది. ఇప్పుడు ఆ కుక్క కారణంగా ప్రాణాలు దక్కించుకున్న అందరూ చనిపోయిన దానికీ థాంక్స్ చెప్పుకుంటున్నారు.