వార్డు మెంబ‌ర్‌గా గెల‌వ‌లేనోళ్లు చెప్పిన‌ట్టా... పార్టీ బ‌తుకుతుందా...!

తెలంగాణ‌లో కాంగ్రెస్ ప‌రిస్థితి ఎంత ద‌య‌నీయ స్తితిలో ఉందో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు.ఇలాంటి ప‌రిస్థితుల్లో టీ కాంగ్రెస్ అధ్య‌క్షుడిగా ఓ స‌మ‌ర్థుడు అయిన వ్య‌క్తిని నియ‌మించి పార్టీని బ‌తికించుకోవాల‌ని ప‌లువురు కోరుతున్నారు.

 Person Who Made No Win For Ward Member..will Strength Party, T Congress, Congres-TeluguStop.com

టీ పీసీసీ రేసులో చాలా మంది పోటీలో ఉన్నా ప్ర‌ధానంగా కోమ‌టిరెడ్డి వెంక‌ట‌రెడ్డితో పాటు రేవంత్‌రెడ్డి పేర్లు ప్ర‌ముఖంగా వినిపిస్తున్నాయి.వీరిద్ద‌రు ప్ర‌స్తుతం ఎంపీలుగా ఉన్నారు.

వీరిలో రేవంత్ యువ‌కుడు కావ‌డంతో పాటు సీఎం కేసీఆర్‌, ఆయ‌న కుటుంబాన్ని ఢీ కొట్టే యువ‌నేత‌గా మంచి పేరు తెచ్చుకున్నారు.

అయితే రేవంత్‌కు టీ పీసీసీ పీఠం రావ‌డం ఇష్టం లేని ముస‌లి కాంగ్రెస్ తాత‌య్య‌లు, చివ‌ర‌కు వార్డు మెంబ‌ర్‌గా గెల‌వ‌లేకుండా రెండు మూడు సార్లు సోనియ‌మ్మ భ‌జ‌న చేసుకుని ఎంపీలు అయిన వారు ఇష్ట‌మొచ్చిన‌ట్టు మాట్లాడుతున్నారు.

ఓ ముస‌లి తాత అయితే త‌న జీవితంలో వార్డు మెంబ‌ర్‌గా కూడా గెలిచే స‌త్తా లేక‌పోయినా రెండు సార్లు రాజ్య‌స‌భ‌కు ఎంపికై ఇప్పుడు కాంగ్రెస్ అధిష్టానాన్నే బెదిరిస్తున్నాడు.రేవంత్‌రెడ్డికి పీసీసీ ఇస్తే తాను పార్టీని వ‌దిలిపోతాన‌ని ఉడ‌త బెదిరింపుల‌కు దిగుతున్నాడు.

Telugu Congress, Congress Pcc, Ghmc, Jaga Reddy, Komati Reddy, Revanth Reddy, Pc

పైగా జ‌గ్గారెడ్డికి పీసీసీ ఇవ్వాల‌ని ఆ ముసలి తాత కోరుతున్నాడు.జ‌గ్గారెడ్డి ఎన్ని పార్టీలు మారారో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు.టీఆర్ఎస్ నుండి వ‌చ్చి కాంగ్రెస్ లో చేరి, మ‌ధ్య‌లో బీజేపీ వెళ్లి తిరిగి కాంగ్రెస్‌లోకి వ‌చ్చారు.ఇక ఈ మాట‌లు మాట్లాడుతున్న తాత‌కు 2014లో సొంత నియోజ‌క‌వ‌ర్గంలో సీటు ఇస్తే డిపాజిట్ రాలేదు స‌రిక‌దా.

చివ‌ర‌కు నాలుగో స్థానంతో స‌రిపెట్టుకున్నాడు.

ఇక మ‌రో నేత అయిన కోమ‌టిరెడ్డి వెంక‌ట‌రెడ్డికి కూడా పీసీసీ అధ్య‌క్షుడు అయ్యేందుకు అన్ని అర్హ‌త‌లు ఉన్నాయి.

అయితే ఆయ‌న్ను కేంద్ర స్థాయిలో పార్టీ ప‌రంగా అత్యున్న‌త ప‌ద‌విలోకి తీసుకుంటాన‌ని ఇప్ప‌టికే చెప్పారు.ఇప్ప‌ట‌కి అయినా ఈ ముస‌లి తాత‌ల‌ను కాంగ్రెస్ ప‌క్క‌న పెట్ట‌క‌పోతే తెలంగాణ‌లో ఆ పార్టీకి మ‌రి కొద్ది నెల‌ల్లోనే నూక‌లు చెల్లిపోవ‌డం ఖాయం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube