సిక్స్ ప్యాక్ కోసం వ్యక్తి వినూత్న నిర్ణయం.. నవ్వులు పూయిస్తున్న వీడియో

చాలా మంది ఊబకాయంతో కూడిన శరీరంతో బయటకు వెళ్లలేక ఇబ్బంది పడుతుంటారు.సినిమాల్లోనూ, బయట హోర్డింగ్స్‌లోనూ కనిపించే మాదిరిగా సిక్స్ ప్యాక్క కావాలని కోరుకుంటుంటారు.

 Person Innovative Decision For Six Pack  Laughing Video , Six Pack , Viral Lates-TeluguStop.com

దీని కోసం జిమ్‌లకు వెళ్లి చాలా మంది చెమటోడ్చుతారు.మరికొందరు జిమ్‌లో వర్కవుట్లు చేయలేక మధ్యలోనే వదిలేస్తారు.

అయితే ఇలాగే జిమ్‌కు వెళ్లి, ఓ వ్యక్తి పడరాని పాట్లు పడ్డాడు.ఎక్సర్‌సైజులు, వర్కవుట్లు తన వల్ల కాదని మధ్యలోనే వాటికి మంగళం పాడేశాడు.

అయితే సిక్స్ ప్యాక్‌పై మోజు పోకపోవడంతో వినూత్న నిర్ణయం తీసుకున్నాడు.దీనికి సంబంధించిన వీడియోను అతడు సోషల్ మీడియాలో పెట్టడంతో అది విపరీతంగా వైరల్ అయింది.

నెటిజన్లకు నవ్వులు పూయిస్తోంది.

దక్షిణాఫ్రికాలోని మాంచెస్టర్‌కు చెందిన డీన్ గుంథర్(34) ఊబకాయంతో బాధపడుతున్నాడు.

అతడికి సినిమా హీరోల మాదిరిగా సిక్స్ ప్యాక్ సాధించాలనే కోరిక ఉండేది.దీంతో జిమ్‌కి వెళ్లి ట్రైనర్ సూచించినట్లు కొంత కాలం వర్కవుట్లు చేశాడు.

బద్ధకం వల్ల జిమ్‌కు వెళ్లడం మధ్యలోనే మానేశాడు.అయితే సిక్స్ ప్యాక్ సాధించాలనే అతడి ఆశ మాత్రం చావలేదు.

దీంతో వినూత్నంగా ఆలోచించాడు.అనుకున్నదే తడవుగా ఓ టాటూ ఆర్టిస్ట్‌ డీన్‌ను సంప్రదించాడు.

తనకు కడుపుపై టాటూ వేయాలని, అది అచ్చం సిక్స్ ప్యాక్‌లా ఉండాలని చెప్పాడు.మనిషి కడుపుపై అబ్స్ మాదిరిగా ఉండేలా టాటూ వేశాడు.

టాటూ ఆర్టిస్ట్ స్పందిస్తూ తాను కలర్ రియలిజంపై దృష్టి సారిస్తున్నట్లు పేర్కొన్నాడు.చూడగానే అచ్చం సిక్స్ ప్యాక్ మాదిరిగా కనిపించేలా టాటూ వేసినట్లు చెప్పాడు.

దీనికి సంబంధించిన వీడియోను టాటూ ఆర్టిస్ట్ స్వయంగా సోషల్ మీడియాలో షేర్ చేశాడు.వెంటనే ఇది చూసిన నెటిజన్లు పడీ పడీ నవ్వడం మొదలు పెట్టారు.

చాలా మంది ఇది పచ్చబొట్టేనా కాదా అని అనుమానం వ్యక్తం చేస్తూ కామెంట్లు పెట్టారు.అతడు పచ్చబొట్టు వేసిన తీరును ప్రశంసిస్తూనే గుంథర్ పాట్లు గురించిన ఫన్నీగా కామెంట్లు వేస్తున్నారు.

ఇలా అయితే కేవలం రెండు రోజుల్లోనే అందరికీ సిక్స్ ప్యాక్‌లు వచ్చేస్తాయని సదరు వీడియోపై లైకుల వర్షం కురిపిస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube