వైరల్: గదిలో 124 పాములతో పాటు శవం..!

పాముని చూస్తే భయపడని వారు ఎవరుంటారు.అంతెందుకు బొద్దింకను, బల్లిని చూసినా భయపడి పరుగులు తీసే వారు ఎంతో మంది ఉన్నారు.

 Person Found Dead In Courtyard Of House, 124 Snakes Surrounded Corpse,124snakes-TeluguStop.com

అలాంటిది ఆ ఇంట్లో ఒకటో.రెండో కాదు.

ఏకంగా 120 కి పైగా సర్పాలు ఉన్నాయి.ఆ విష సర్పాల మధ్య ఓ వ్యక్తి చచ్చి పడిపోయి ఉన్నాడు.

అయితే, ఆ వ్యక్తి ఎలా చనిపోయాడనేది మాత్రం ఎవరికీ తెలియదు.వివరాల్లోకి వెళ్తే.

అమెరికాలోని మేరీల్యాండ్‌ లో ఓ 49 ఏళ్ల వ్యక్తి ఇంట్లో ఒంటరిగా నివసిస్తున్నాడు.ఎప్పుడూ ఆ ఇంటి నుండి మాటలు వినపడేవి.

ఆ వ్యక్తి కూడా అప్పుడప్పుడు బయటకు తిరుగుతుంటాడు.

కానీ ఓ రోజు ఆ ఇంటి నుండి ఎలాంటి మాటలు వినపడలేదు.

అంతా నిశ్శబ్దం.ఆ వ్యక్తి కూడా ఆ రోజు కనిపించలేదు.దీంతో పక్కింట్లో ఉన్న ఓ వ్యక్తికి అనుమానం వచ్చింది.దీంతో ఆ వ్యక్తి పక్కింటికి వెళ్లి డోర్ కొట్టి చూసాడు.లోపల డోర్ లాక్ చేసి ఉంది.దీంతో అతను కాలింగ్ బెల్ కొట్టాడు.

కానీ, అతడు లోపలి నుండి ఎవరూ స్పందించలేదు.దీంతో ఆ వ్యక్తి కిటికీ నుంచి లోపలికి చూడగా.

ఆ వ్యక్తి ఓ గదిలో కిందపడి కనిపించాడు.దీంతో అతడు పోలీసులకు కాల్ చేశాడు.

ఈ సమాచారం అందుకున్న పోలీసులు త్వరత్వరగా ఆ ఇంటికి చేరుకున్నారు.అయితే, ఆ గదిలో అడుగుపెట్టిన పోలీసులు ఒక్కసారిగా షాక్ తిన్నారు.చచ్చి పడి ఉన్న ఆ వ్యక్తి చుట్టూ.వందలాది సర్పాలు ఉన్నాయి.అయితే అవి బయట లేవు.ఇనుప జువ్వలతో తయారు చేసిన బాక్సుల్లో అవి పెట్టబడి ఉన్నాయి.

అయితే మొత్తం 124 పాములను చనిపోయిన ఆ వ్యక్తి బయట ఎవరికీ తెలియకుండా ఒక గదిలో పెట్టి పెంచుకుంటున్నాడు.అయితే, అతడు పాము కరవడం వలన చనిపోవడం జరిగిందా.? లేక మరొక కారణం ఏదైనా ఉందా? అనే విషయం మాత్రం తెలియాల్సి ఉంది.అయితే, మేరీల్యాండ్‌లో పై అధికారుల అనుమతి లేకుండా ఏ వన్య ప్రాణులను పెంచుకోకూడదు.

కానీ, అతడు మాత్రం వందలాది సర్పాలను ఇంట్లో ఉంచుకుని ఏం చేస్తున్నాడనేది తెలియాల్సి ఉంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube