టీ పొడి అమ్మి, స్వీట్స్ షాప్ పెట్టి ఎస్ వి కృష్ణారెడ్డి కి సహాయం చేసింది ఎవరో తెలుసా..?

తెలుగు చలనచిత్ర రంగంలో ఎన్నో సూపర్ హిట్ చిత్రాలను తెరకెక్కించిన ఎస్వీ కృష్ణారెడ్డి ప్రతిభ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే.నిజానికి కృష్ణారెడ్డి గొప్ప దర్శకుడిగా మారడానికి ఆయన స్నేహితుడైన అచ్చిరెడ్డి కారణమని అంటుంటారు.

 Sv Krishna Reddy Personal Life Unknown Facts-TeluguStop.com

అచ్చి రెడ్డి ఎస్.వి కృష్ణారెడ్డి చిన్నతనం నుంచి స్నేహితులు.వీళ్ళిద్దరూ ఒకే స్కూల్లో చదువుకున్నారు.అప్పట్లోనే ఒకరంటే ఒకరికి ఎంతో ఇష్టం ఉండేది.అయితే అసలు వీళ్ళిద్దరూ కలిసి సినిమాల్లో ఎలా రంగప్రవేశం చేశారో ఈ ఆర్టికల్ లో వివరంగా తెలుసుకుందాం.

పశ్చిమగోదావరి జిల్లాలోని అరవల్లి గ్రామంలో జన్మించిన కృష్ణా రెడ్డి, అచ్చి రెడ్డి 10వ తరగతి వరకు ఒకే స్కూల్లో కలిసి చదువుకున్నారు.

 Sv Krishna Reddy Personal Life Unknown Facts-టీ పొడి అమ్మి, స్వీట్స్ షాప్ పెట్టి ఎస్ వి కృష్ణారెడ్డి కి సహాయం చేసింది ఎవరో తెలుసా..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఇంటర్మీడియట్ నుంచి మాత్రం వేర్వేరు కాలేజీలలో చదువుకున్నారు.అయితే కాలేజీ వేరైనా.ఇద్దరూ తరచూ కలుసుకునేవారు.కృష్ణారెడ్డి కి చిన్నప్పటి నుంచే సినిమాలపై వల్లమాలిన అభిమానం ఉండేది.

అందుకే ఆయన ఎం.కాం పూర్తి చేయగానే సినిమా రంగంలో రాణించాలని చెన్నై కి వెళ్ళిపోయారు.అచ్చిరెడ్డి మాత్రం ఏవో వ్యాపారాలు చేస్తూ హైదరాబాద్ నగరంలోనే సెటిలయ్యారు.చెన్నై కి వెళ్ళిన కృష్ణారెడ్డి.పగడాల పడవ, కిరాతకుడు వంటి సినిమాలలో చిన్న పాత్రలు పోషించారు.కానీ ఆ పాత్రలు ఆయనకు ఎటువంటి గుర్తింపు తెచ్చి పెట్టలేదు.

దీంతో ఆయన చెన్నై నుంచి హైదరాబాద్ నగరానికి వచ్చి అచ్చి రెడ్డిని కలిశారు.

అయితే కృష్ణారెడ్డి కి సినిమా రంగంలో స్థిరపడాలని ఉన్నా కూడా చేతిలో సరిపడినన్ని డబ్బులు లేక అచ్చి రెడ్డి తో కలిసి వ్యాపారాలు చేయడం మొదలుపెట్టారు.

టీ పొడి అమ్మడంతో పాటు ఒక స్వీట్ షాప్ పెట్టి బాగానే డబ్బులను సంపాదించారు.అయితే తమ వ్యాపారాలు లాభాల బాటలో నడుస్తున్నప్పటికీ కృష్ణారెడ్డి అసంతృప్తి వ్యక్తం చేసేవారు.అయితే ఆయన అసంతృప్తిగా ఉండటాన్ని గమనించిన అచ్చిరెడ్డి ఒక రోజు మాట్లాడుతూ.‘నీకు సినిమాలు అంటే ఎంతో అభిమానం.నీకున్న ప్రతిభ సినిమా రూపంలో అద్భుతాలను సృష్టించగలదు.అందుకే మనం వ్యాపారాలన్నీ మానేసి సినిమాకి సంబంధించిన ఏదైనా వ్యాపారం పెడదాం’ అని అన్నారు.దీంతో కృష్ణా రెడ్డి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.మళ్లీ తన కలలకు రెక్కలు వచ్చాయి.

అయితే వాళ్లు ముందుగా దూరదర్శన్ టీవీ ఛానల్ కి సినిమా సాటిలైట్ రైట్స్ అమ్మే వ్యాపారాన్ని పెట్టారు.నిర్మాతల నుంచి సినిమాలు కొనడం ఎంతోకొంత లాభం చూసుకుని దూరదర్శన్ కు అమ్మడం వంటివి చేసేవారు.అయితే ఆ క్రమంలోనే సర్వర్ సుందరం అనే సినిమాకి పోస్ట్ ప్రొడక్షన్ చేసే అవకాశం రావడంతో కృష్ణారెడ్డి తనకున్న సాంకేతిక అవగాహన తో సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులను వెంటనే పూర్తి చేశారు.దీంతో అచ్చిరెడ్డి ఆశ్చర్యపోయారు.

ఆ తర్వాత మూవీ క్యాసెట్లను అమ్మే వ్యాపారం ప్రారంభించారు.అనంతరం ఇతర భాషా సినిమాల డబ్బింగ్ రైట్స్ ని కొనుగోలు చేయడం ప్రారంభించారు.1990లో మమ్ముట్టి తారాగణంలో వచ్చిన “ఐయర్ ది గ్రేట్” అనే మలయాళ సినిమాను తెలుగులో సూర్య ది గ్రేట్ పేరిట డబ్ చేసి థియేటర్లలో విడుదల చేశారు.ఈ సినిమాతో నిర్మాతగా మారిన అచ్చిరెడ్డి, కృష్ణారెడ్డి.

మమ్ముట్టి నటించిన మరో సినిమాని “దర్యాప్తు” పేరిట విడుదల చేసి బాగా లాభాలను సంపాదించారు.

అనంతరం మనీషా ఫిలిమ్స్ బ్యానర్ ని కిషోర్ రాతి తో కలసి స్థాపించి స్ట్రెయిట్ తెలుగు సినిమాలను నిర్మించడానికి అచ్చిరెడ్డి, కృష్ణారెడ్డి సిద్ధమయ్యారు.కృష్ణారెడ్డి తాను రాసుకున్న కథతో కొబ్బరిబోండాం సినిమాను తెరకెక్కించాలనుకున్నారు. రాజేంద్ర ప్రసాద్ ని హీరో గా ఎంపిక చేసుకున్నారు.

కాట్రగడ్డ రవితేజ కి దర్శకత్వ బాధ్యతలు అప్పగించారు.అయితే ఈ సినిమాకి కథ, స్క్రీన్ ప్లే అందించడంతో పాటు సంగీతం కూడా కృష్ణారెడ్డి గారే అందించారు.

అయితే కొబ్బరిబోండాం సినిమా సూపర్ హిట్ కావడంతో బాగా లాభాలు వచ్చాయి.వచ్చిన లాభాలతో మళ్ళీ రాజేంద్ర ప్రసాద్ తో కలిసి రాజేంద్రుడు-గజేంద్రుడు సినిమాని తెరకెక్కించారు.

అయితే ఈ సినిమాతో కృష్ణారెడ్డి దర్శకుడిగా మారారు.ఈ సినిమా కూడా బ్లాక్ బాస్టర్ హిట్ కావడంతో కృష్ణా రెడ్డి ఫుల్ టైం దర్శకుడిగా.

అచ్చిరెడ్డి ఫుల్ టైం నిర్మాతగా మారిపోయారు.వారిద్దరి కాంబినేషన్ లో మాయలోడు, శుభలగ్నం వంటి ఎన్నో సూపర్ హిట్ చిత్రాలు తెరకెక్కి తెలుగు ప్రేక్షకులను ఎంతగానో అలరించాయి.

ఏది ఏమైనా కృష్ణా రెడ్డి అచ్చి రెడ్డి తమ బాల్య స్నేహాన్ని వదులుకోకుండా ఒకరికి ఒకరు సహాయం చేసుకుంటూ ఉన్నత శిఖరాలను అధిరోహించి స్నేహితులందరికీ ఆదర్శవంతులు అయ్యారు.

#Atchi Reddy #Rajendra Prasad #Manisha Films #Mammootty

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు