డోంట్ మిస్: నేటి రాత్రి ఆకాశంలో అద్భుత సంఘటనలు...!

అనంత విశ్వంలో రోజుకొక వింత సంఘటనలు చోటు చేసుకుంటూనే ఉంటాయి.ఇకపోతే పెర్శీడ్ ఉల్కాపాతం దగ్గరికి రాబోతోంది.

 See ‘shooting Stars’ Tonight, Incredible Truth , Dancing Sky,perseids Peak,-TeluguStop.com

ఇకపోతే ఈ సంవత్సరంలో ఈ ఉల్కాపాతం మే అత్యంత కాంతివంతమైన అని శాస్త్రజ్ఞులు చెబుతున్నారు.అయితే ఈసారి భారతీయుల అదృష్టం ఏమిటంటే ఈ కాంతిపుంజం మనకు కూడా కనబడుతోంది.

కాబట్టి ఈ ఛాన్స్ ను మిస్ అయితే అంత సులువుగా మనం మళ్లీ చూడలేం.కాబట్టి ఈ అవకాశాన్ని నేడు వదులుకోవద్దు.

ముఖ్యంగా రెండు సమస్యల వల్ల మనం ఈ అద్భుతాన్ని మనం ఆకాశంలో చూడలేక పోవచ్చు.అవేమిటంటే ఆకాశంలో మబ్బులు, చందమామ కాంతి.ఈ రెండు ఎక్కువగా లేకపోతే మీరు ఆ ఆనందాన్ని పొందవచ్చు. ఆకాశం నిర్మలంగా ఉండి మేఘాలు లేకుండా ఉంటే మీరు ఈ ఉల్కాపాతాలను డైరెక్టుగా కంటితో చూసేయొచ్చు.

ఇక నేడు షిఫ్ట్ టట్టిల్ అని తోకచుక్క నుంచి జారిపడే మూలికలను నేడు మనం చూడవచ్చు.ఇకపోతే ఇదివరకు ఈ తోకచుక్క నుండి గంటకు జారి పడే ఉల్కలు 50 పైగా ఉండేవని, కాకపోతే అవి ఇప్పుడు వాటి సంఖ్య కేవలం 15 నుండి 20 వరకు మాత్రమే వస్తున్నట్లు శాస్త్రవేత్తలు తెలుపుతున్నారు.

కాబట్టి ప్రతి నిమిషానికి రెండు లేదా మూడు మనం చూడవచ్చు.ఒక్కొక్క తోకచుక్క ఓం నక్షత్రంలో అలా మెరుస్తూ మన కంటి చూపు ముందరే మాయమవుతాయి.

ఇక మన భారతదేశంలో ఈ రోజు రాత్రి ఈ తోకచుక్కలు ఎక్కువ సంఖ్యలో కనపడతాయి.అయితే నేటి అర్ధరాత్రి దాటాక గురువారం తెల్లవారుజామున రెండు గంటల సమయం నుండి సూర్యోదయం వరకు ఈ తోకచుక్కలు మనకు కనిపిస్తాయి.

కాబట్టి మీరు ఈ తోకచుక్కలను చూడాలి అనుకుంటే కచ్చితంగా ఎటువంటి అంతరాయం లేకుండా ఆకాశం స్పష్టంగా కనబడే విధంగా ఏర్పాటు చేసుకోండి.ఇలా ఉంటే మీరు నేరుగా ఆకాశంలో వచ్చే తోకచుక్క లను మనసారా వీక్షించవచ్చు.

ఇలాంటి అరుదైన అవకాశం ఎప్పుడు పడితే అప్పుడు రావు కాబట్టి వచ్చినప్పుడు వాటిని మిస్ చేసుకోవద్దు.అవి మనకు మధురమైన జ్ఞాపకాలుగా మిగిలిపోతాయి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube