ఫ్యాన్‌ గుర్తుకు ఓటేసిన వారికి గూబ గుయ్యిమనేలా సమాధానం చెప్పిన పేర్ని నాని

ఆంధ్రప్రదేశ్‌లో మంత్రులు మాట్లాడే తీరు చాలా విచిత్రంగా ఉంటోంది.తమను ప్రశ్నించే దమ్ము ఎవరికీ లేదన్న అతి విశ్వాసమో లేక మరొకటోగానీ నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నారు.

 Perni Nani Comments On Rtc Charges-TeluguStop.com

కొడాలి నానిలాంటి వాళ్లు యథేచ్ఛగా బూతులు మాట్లాడుతుంటే.పేర్ని నాని, బొత్సలాంటి వాళ్లు అర్థం పర్థం లేని సమాధానాలు ఇస్తున్నారు.

ఏపీ ఆర్ఠిక పరిస్థితి రోజురోజుకూ దిగజారుతోంది.ఆదాయం పెంచుకునే మార్గం తెలియక ప్రజలపైనే భారం మోపాలని జగన్‌ సర్కార్‌ నిర్ణయించింది.ఇప్పటికే ఆర్టీసీ చార్జీలు పెంచారు.కరెంటు చార్జీలు పెంచడానికి కూడా సిద్ధమవుతున్నారు.

ఏకంగా భూమిశిస్తు వేసే ఆలోచన కూడా చేస్తున్నారు.ఇదేంటని ప్రశ్నిస్తే మంత్రులు వితండ వాదం చేస్తున్నారు.

చార్జీలు పెంచబోమని మేనిఫెస్టోలో ఏమీ పెట్టలేదు కదా అని మంత్రి పేర్ని నాని అనడం గమనార్హం.ఆర్టీసీ చార్జీలు పెంచొద్దని జగన్‌ను ఎవరూ పాదయాత్రలో కోరలేదట.మేనిఫెస్టోలోనూ పెట్టలేదట.అటు మరో మంత్రి బొత్స కూడా ఇలాగే వాదిస్తున్నారు.చార్జీలో పెంచబోమని మేనిఫెస్టోలో ఎక్కడుందో చూపించండి అంటూ దానిని మీడియా ముందు పెడుతున్నారు.

అసలు మేనిఫెస్టో అంటే ఏంటి? ఎన్నికల్లో గెలిస్తే తమ పార్టీ తరఫున ప్రజలకు ఏం చేస్తామో చెప్పే ఓ హామీ పత్రం.ఇందులో అన్ని అంశాలు ఉండవు.చివరికి చార్జీలు పెంచే అంశాన్ని కూడా ఎవరూ మేనిఫెస్టోలో ప్రస్తావించరు.కానీ వైసీపీ మంత్రులు మాత్రం ప్రతి విషయానికి మేనిఫెస్టోను ముందు పెడుతున్నారు.

#VijawadaMP #APCM #Perni Nani #PerniNani

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు