పీరియడ్స్‌ ఏమోజీలు వచ్చాయి... మహిళలు ఇకపై చాటింగ్‌ లో వీటిని వాడేసుకోవచ్చు  

  • ప్రస్తుతం సోషల్‌ మీడియా ఏ స్థాయిలో ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రతి చిన్న విషయాన్ని కూడా స్నేహితులతో షేర్‌ చేసుకునేందుకు అమ్మాయిలు అయినా అబ్బాయిలు అయినా కూడా సోషల్‌ మీడియాను ఆశ్రయిస్తున్నారు. ముఖ్యంగా వాట్సప్‌ ప్రస్తుతం ప్రపంచాన్ని మార్చి వేసింది. ప్రతి రోజు వందల కోట్ల మెసేజ్‌లు వాట్సప్‌ ద్వారా షేర్‌ అవుతున్నాయనడంలో ఎలాంటి సందేహం లేదు. అద్బుతమైన ఫీచర్స్‌తో వాట్సప్‌ రోజు రోజుకు మార్పు చెందుతూ వినియోగ దారులను ఆకట్టుకుంటూనే ఉంది. ఇక కొత్తగా ఏమోజీలు వచ్చాయి.

  • నవ్వినా, ఏడ్చినా, నొప్పితో ఉన్నా ఇలా అన్నింటికి కూడా ఏమోజీలు ఉన్నాయి. అయితే అమ్మాయిలు పీడియర్స్‌లో ఉన్న సమయంలో తమ బాధను స్నేహితులతో షేర్‌ చేసుకునేందుకు మాత్రం ఏమోజీ లేదు. దాంతో కొన్ని సోషల్‌ మీడియా సంస్థలు మహిళల కోసం ప్రత్యేకంగా ఆ ఏమోజీలను తయారు చేయడం జరిగింది. అయితే మొదట అమ్మాయిల పీరియడ్స్‌ను చూపించేందుకు బ్లడ్‌ డ్రాప్‌తో ఉన్న ఏమోజీని వాడేవారు. కాని బ్లడ్‌ డ్రాప్‌ అంటే ఠక్కున పీరియడ్స్‌ అని గుర్తించలేరు. ఎందుకంటే ఏదైనా ప్రమాదం జరిగితే రక్తం పోయిందంటే కూడా దాన్ని వాడుతారు. ఇంకా రకరకాలుగా కూడా వాడుతారు. అందుకే కొందరు మహిళల కోరిక మేరకు మరిన్ని ఏమోజీలను సంస్థలు తీసుకు వచ్చాయి.

  • Period Emoji Created To Help Girls Talk About Menstruation-New Period Smart Phones

    Period Emoji Created To Help Girls Talk About Menstruation

  • కొత్త ఏమోజీలు కొన్ని థర్డ్‌ పార్టీ యాప్‌లు అందుబాటులోకి తీసుకు వచ్చాయి. శానిటరీ న్యాప్కిన్‌ టైప్‌లో ఉండే ఏమోజీని ఎక్కువగా వాడేందుకు మహిళలు ఆసక్తి చూపుతున్నారు. ఇండియాలో పీరియడ్స్‌ అంటేనే కాస్త రహస్యంగా ఉంచుతారు. అలాంటిది ఇలాంటి ఏమోజీలను వాడుతారా అయితే విదేశాల్లో మాత్రం ఈ ఏమోజీలను ఎక్కువగా వాడుతున్నారు. త్వరలోనే ఇండియాలో కూడా ఈ ఏమోజీలను వాడుతారని ఆశిద్దాం. కొన్ని రకాల ఏమోజీలను ఇక్కడ చూపించడం జరిగింది. మరి కొన్ని కూడా థర్డ్‌ పార్టీ వారి ద్వారా తయారు చేయబోతున్నాయి.