PONDS Powder తో ఇలా చేస్తే ముఖంపై నలుపు మొత్తం పోయి తెల్లగా,అందంగా మెరుస్తుంది  

  • ponds పౌడర్ ని ఉపయోగించి ముఖం తెల్లగా ఎలా మారుతుందో తెలుసుకుందాం. సాధారణంగా మనం ముఖానికి పౌడర్ రాస్తూ ఉంటాం. ఈ విధంగా ప్రతి ఒక్కరు చేస్తారు. ఇది అందంలో ఒక పార్ట్ అని చెప్పవచ్చు. ఇలా పౌడర్ రాయటం వలన అప్పటికప్పుడు ముఖం తెల్లగా మరియు అందంగా కనపడుతుంది. అయితే ponds పౌడర్ ని ఇలా వాడితే ముఖం మీద నలుపు తొలగిపోయి తెల్లగా మారటమే కాకుండా కాంతివంతంగా ఉంటుంది. ponds పౌడర్ ముఖాన్ని తెల్లగా ఎలా మారుస్తుందా అని ఆలోచనలో పడ్డారా? ఇప్పుడు చెపుతున్న చిట్కాను పాటిస్తే మీరే ఆశ్చర్యపోతారు. ముఖాన్ని తెల్లగా,అందంగా,కాంతివంతంగా, ముఖం మీద నలుపు తొలగించుకోవడానికి Ponds పేస్ పౌడర్ ని ఎలా ఉపయోగించాలో తెలుసుకుందాం.


  • ఇప్పుడు పేస్ ప్యాక్ తయారుచేసుకోవాలి. ఫెస్ ప్యాక్ కి ponds పౌడర్, అలోవెరా జెల్,విటమిన్ E క్యాప్సిల్ అవసరం అవుతాయి. ఈ పదార్ధాలను ఉపయోగిస్తే ముఖం మీద పేరుకున్న మలినాలు,తాన్, నలుపు,కంటి కింద నల్లటి వలయాలు అన్ని ఈ చిట్కాతో తొలగిపోతాయి. ponds పౌడర్, అలోవెరా జెల్,విటమిన్ E క్యాప్సిల్ తో ప్యాక్ ఎలా తయారుచేయాలి. ముఖానికి ఎలా అప్లై చేయాలో చూద్దాం.

  • ఒక బౌల్ లో ఒక స్పూన్ అలోవెరా జెల్, ఒకటి విటమిన్ E క్యాప్సిల్ లోని ఆయిల్ వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమంలో అర స్పూన్ ponds పౌడర్ వేసి బాగా కలిసేలా కలపాలి. ముఖాన్ని శుభ్రం కడిగి పైన తయారుచేసుకున్న మిశ్రమాన్ని ముఖానికి రాయాలి. రెండు నిమిషాల పాటు చేతి వేళ్ళతో సున్నితంగా మసాజ్ చేయాలి. ఈ విధంగా రాత్రి పడుకొనే ముందు చేయాలి. కంటి కింద నల్లటి వలయాలు ఉంటే అక్కడ కూడా ఈ మిశ్రమాన్ని అప్లై చేయాలి.

  • ఈ విధంగా చేసి మరుసటి రోజు ఉదయం ముఖాన్ని శుభ్రంగా కడగాలి. ఈ విధంగా ప్రతి రోజు చేస్తూ ఉంటే వారం రోజుల్లో మీ ముఖం నలుపు పోయి కాంతివంతంగా మారుతుంది. ఒకవేళ మీ దగ్గర Ponds పౌడర్ లేకపోతే మంచి నాణ్యమైన తెల్లని పౌడర్ ఏదైనా పర్వాలేదు. సో ఫ్రెండ్స్ ఈ చిట్కాను ఫాలో అయ్యి మీ ముఖాన్ని తెల్లగా,కాంతివంతంగా మార్చుకోండి.