ప్రజల ఆరోగ్యం కోసం పద్ధతి మార్చుకుంటున్న పెప్సీ కంపెనీ

పెప్సి, స్ప్రైట్, కోకోకొలా, 7అప్, మౌంటేన్ డ్యూ లాంటి కూల్ డ్రింక్స్ లో ఉన్న కాలరీలు, కెమికల్స్ మీద ఇటివలి కాలంలో రాజ్యసభలో చర్చలు జరిగిన సంగతి తెలిసిందే.ఈ కూల్ డ్రింక్స్ లో ఉంటున్న టాక్సిన్స్, షుగర్ లెవెల్స్ పై ఇప్పటికే ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ హైజిన్ ఆండ్ పబ్లిక్ హెల్త్ కొన్ని నిజాలు బయటపెట్టింది.

 Pepsi To Come Up With Much Healthier Cool Drinks-TeluguStop.com

ఆ కారణంతోనే భారత ప్రభుత్వం కూల్ డ్రింక్స్ మీద దృష్టిపెట్టింది.ఇక వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఎప్పటికప్పుడు ఈ విషయం మీద ప్రజల్ని చైతన్యవంతం చేసేందుకు ప్రయత్నాలు చేస్తూనే.

అయితే ప్రభుత్వాలు ఇంకా సరైన యాక్షన్ తీసుకోవడం మొదలుపెట్టకముందే పెప్సి కంపెనీ దిగివచ్చింది.ఇకపై తమ ప్రాడక్ట్స్ ని జాగ్రత్తగా తయారుచేస్తామని చెబుతోంది.

ఆ కంపెనీ యొక్క సేల్స్ మాత్రమే కాదు, ప్రపంచ దేశాల్లో ఇతర కూల్ డ్రింక్ కంపెనీల సేల్స్ కూడా చాలావరకు పడిపోతున్నాయంట.

అందుకే పెప్సి సీఈఓ ఇంద్ర నూయీ పెప్సి ప్రాడక్ట్స్ లో కంటెంట్ మారనుందని ప్రకటించారు.

ప్రస్తుతం ఒక మీడియం కూల్ డ్రింక్ 150 కాలరీలు ఉంటే, దాని సంఖ్య 100 కన్నా తక్కువ ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటామని, అలాగే అరోగ్యకరమైన డ్రింక్స్ అందించే దిశగా అడుగులు వేస్తున్నామని చెప్పారు.

మరోవైపు కోకోకోలా ఇంకా తన భివష్యత్తు కార్యచరణపై ఒక స్పష్టమైన ప్రకటన చేయలేదు.

అయితే, ఆ కంపెనీ నుంచి కూడా ఒక ప్రకటన వస్తుందని బిజినెస్ వర్గాల అంచనా.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube