పెప్సీ కోసం ఆ దేశం చేసిన పని తెలిస్తే అవాక్కవ్వాల్సిందే!  

pepsi and ussr unusual agreement Cool Drinks, Pepsi, America, Russia, Newyork, Masco, America President Richerd Nixon, Krushevu, - Telugu America, America President Richerd Nixon, Cool Drinks, Krushevu, Masco, Newyork, Pepsi, Russia

కూల్ డ్రింక్స్ అంటే ఇష్టపడే వాళ్లకు పెప్సీ కూల్ డ్రింక్ గురించి కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.ఆరు దశాబ్దాల నుంచి పెప్సీ పేరుతో మార్కెట్లో అందుబాటులో ఉన్న ఈ కూల్ డ్రింక్ ను చాలామంది ఇష్టపడతారు.

TeluguStop.com - Pepsi And Ussr Unusual Agreement

అయితే ఈ కూల్ డ్రింక్ వల్ల ఒక దేశం ఆ దేశంలోని యుద్ధ నౌకలనే అమ్మేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.వినడానికి విచిత్రంగానే ఉన్నప్పటికీ దాదాపు ఆరు దశాబ్దాల క్రితం అమెరికా, సోవియట్ యూనియన్(ఉమ్మడి రష్యా) మధ్య గొడవ వల్ల సోవియట్ యుద్ధనౌకలను అమ్మేయాల్సి వచ్చింది.

పూర్తి వివరాల్లోకి వెళితే 60 ఏళ్ల క్రితం అమెరికాలో టెక్నాలజీని అభివృద్ధి చేయడంలో సోవియట్ అమెరికాకు పూర్తి సహాయసహకారాలు అందించింది.దీంతో ఇరు దేశాల మధ్య మైత్రికి జ్ఞాపకంగా సోవియట్ 1959లో న్యూయార్క్ లో భారీ ఎగ్జిబిషన్ ను ఏర్పాటు చేసింది.

TeluguStop.com - పెప్సీ కోసం ఆ దేశం చేసిన పని తెలిస్తే అవాక్కవ్వాల్సిందే-General-Telugu-Telugu Tollywood Photo Image

ఎగ్జిబిషన్ ను ఏర్పాటు చేయడంతో సంతోషించిన అమెరికా ప్రతిఫలంగా మాస్కోలో అమెరికా ఉత్పత్తులతో పెద్ద ఎగ్జిబిషన్ ను ఏర్పాటు చేసింది.

ఈ ఎగ్జిబిషన్ కు అప్పటి అమెరికా అధ్యక్షుడు రిచర్డ్ నిక్సన్, సోవియట్ ప్రీమియర్ క్రుషేవ్ హాజరయ్యారు.వీళ్లిద్దరూ ఒకరితో ఒకరు మాట్లాడుకుంటున్న సమయంలో క్రుషేవ్ పెప్సీ రుచి చూశాడు.అతనికి పెప్సీ కూల్ డ్రింక్ రుచి ఎంతగానో నచ్చింది.

ఆ తరువాత రిచర్డ్ కు క్రుషవ్ కు పెట్టుబడిదారీ విధానం గురించి జరిగిన చర్చలో గొడవ జరిగింది.అనంతరం సోవియట్ వోడ్కాను ఎగుమతి చేస్తూ పెప్సీని దిగుమతి చేయడానికి ఒప్పందం కుదుర్చుకుంది.

సోవియట్ లో పెప్సీ కొనుగోళ్లు భారీగా పెరిగాయి.అయితే 1980లో సోవియట్ ఆఫ్ఘన్ పై దాడులు చేయడంతో అమెరికా సోవియట్ వోడ్కాపై నిషేధం విధించింది.

దీంతో పెప్సీకి చెల్లింపుల విషయంలో సోవియట్ కు సమస్య ఏర్పడింది.అయితే సోవియట్ పెప్సీ దిగుమతి ఆగకూడదని భావించి మూడు యుద్ధనౌకలను, 17 సబ్ మెరైన్లను పెప్సీకి అప్పగించింది.

ఆ విధంగా పెప్సీ కోసం సోవియట్ ఏకంగా యుద్ధనౌకలు అమ్మేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.

#Krushevu #Pepsi #Masco #Newyork #Cool Drinks

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Pepsi And Ussr Unusual Agreement Related Telugu News,Photos/Pics,Images..