కుక్కను అలా చేసిందని... నోటితో ఆమెను కొరికేసి .... ఇంకా.... ?  

  • కుక్కలు మనుషులను కరవడం సర్వ సాధారణం. కానీ మనిషిని మనిషి కరవడం… అది కూడా కుక్కకంటే దారుణంగా… అంటే అది ఖచ్చితంగా పెద్ద వార్తే. ఇప్పుడు అటువంటి విచిత్రమైన వార్తే సోషల్ మీడియా లో హల్ చల్ చేస్తోంది. నిజమే…. ఉదయాన్నే జాగింగ్ చేస్తున్న ఓ మహిళ తన వెంటబడిన కుక్కను ఛీ కొట్టిందనే కోపంతో దాని యజమాని ఆ మహిళతో కలబడి మరీ కరిచేసిన సంఘటన అందరినీ షాక్‌కు గురిచేసింది. ఓక్లాండ్‌కు చెందిన ఓ మహిళ ఉదయం జాగింగ్ చేస్తుండగా ఓ కుక్క వెంటబడింది.

  • Pepper Spry In Dog Eyes The Owner Of Bruised-

    Pepper Spry In Dog Eyes The Owner Of The Dog Bruised

  • దీంతో కంగారుపడిపోయిన ఆ మహిళ తన వద్ద ఉన్న పెప్పర్ స్ప్రేను కుక్క కంట్లో కొట్టింది. ఇది గమనించిన కుక్క యజమాని అల్మా కడ్వాలడర్ (19) నా కుక్క కళ్లలో పెప్పర్ స్ప్రే కొడతావా అంటూ… సదరు మహిళ చేయి పట్టుకుని కుక్క కంటే దారుణంగా కరిచేసింది. అక్కడితో ఆగలేదు…. ఆమె ముఖం మీద పిడి గుద్దులు గుద్దడంతో పాటు ఎగిరెగిరి ఆమెను తన్నింది. దీంతో ఆ మహిళ తీవ్రంగా గాయపడింది. జరిగిన ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఘటనపై ఈస్ట్‌బే రీజనల్ పార్క్ డిస్ట్రిక్ట్ పోలీసులు కేసు నమోదు చేశారు. అల్మేదా కంట్రో జడ్జ్ వారెంట్ జారీ చేయడంతో పోలీసులు నిందితురాలిని అరెస్టు చేశారు. ఆమెను శాంటారీటా జైల్‌కు తరలించారు.