ఎమ్మార్వోలు మీకే : పెప్పర్ స్ప్రే ఇక తప్పనిసరి

తెలంగాణ లోని అబ్దుల్లాపూర్‌మెట్ ఎమ్మార్వో విజయారెడ్డి మీద ఓ రైతు పెట్రోల్ తో దాడి చేయడం అక్కడికక్కడే ఆమె మరణించడం పెద్ద సంచలనం సృష్టించింది.ఆ ఘటన తరువాత నుంచి ఆఫీసుల్లో విధులు నిర్వహించాలంటే సిబ్బంది భయంతో వణికిపోయే పరిస్థితి నెలకొంది.

 Pepper Spray Is No Longer A Must-TeluguStop.com

తమకు రక్షణ కల్పించకపోతే విధులు నిర్వర్తించలేమని ఇప్పటికే రెవెన్యూ సిబ్బంది ఎక్కడికక్కడ ఉన్నతాధికారులకు వినతి పత్రాలు అందిస్తున్నారు.

ఇక విజయారెడ్డి మీద దాడి తరువాత అటువంటి సంఘటనే సిరిసిల్ల జిల్లాలోనూ జరగడం, జనాలు తమ పని చేయకపోతే పెట్రోల్ పోస్తామంటూ బెదిరింపులకు పాల్పడుతుండడం, ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం బాటిల్స్ లో పెట్రోల్ పోయడం నిషేధించింది.

తెలంగాణ రాష్ట్రంలో దాదాపు 400 మంది వరకు మహిళా రెవిన్యూ అధికారులు ఉన్నారు.

‘విజయారెడ్డిపై దాడి అస్సలు ఊహించలేదు.

మొత్తం మీద రెవిన్యూ సిబ్బంది, అధికారులకు రక్షణ లేకుండా పోయింది.కనీసం మహిళా అధికారులైనా జాగ్రత్తలు తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది’ అని రాష్ట్ర డిప్యూటీ కలెక్టర్ల సంఘం అధ్యక్షుడు వి.లచ్చిరెడ్డి.ఈ సందర్భంగా మహిళా ఉద్యోగులంతా పెప్పర్ స్ప్రేతో విధులకు రావాలంటూ సంఘం నేతలు చెప్పడంతో ఇది కాస్త ప్రస్తుతం వైరల్ అవుతోంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube