బ్రహ్మీ క్రేజ్‌ తగ్గలేదంటున్న సర్వే

కమెడియన్‌గా స్టార్‌ హీరోలకు గట్టి పోటీ ఇచ్చిన బ్రహ్మానందం గత కొంత కాలంగా ప్రాభవంను కోల్పోయాడు అనే విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.ఈయన పోషించిన ఏ ఒక్క పాత్ర కూడా పూర్తి స్థాయిలో హాస్యాన్ని ప్రేక్షకులకు పంచి పెట్టలేక పోయింది.

 Peoples Crazy On Brahmanandam-TeluguStop.com

దాంతో బ్రహ్మానందం రిటైర్‌మెంట్‌ టైం వచ్చింది అంటూ ఇండస్ట్రీలో టాక్‌ వినిపించింది.కాని ప్రేక్షకులు మాత్రం బ్రహ్మానందం ఇప్పటికి తమ అభిమాన కమెడియన్‌ అంటూ ఒక సర్వేలో తేల్చి చెప్పారు.

బ్రహ్మానందంలో ఇప్పటికి అదే ఫైర్‌ ఉందని, అయితే ఆయన ప్రతిభను దర్శకు సరైన రీతిలో వాడుకోవడంలో విఫలం అవుతున్నారని, బ్రహ్మీని వాడుకుంటే దుమ్ము లేపొచ్చు అని కొందరు అంటున్నారు.ప్రస్తుతం ఉన్న కమెడియన్స్‌లో స్టార్‌ కమెడియన్‌ ఎవరు అన్న ప్రశ్నకు అత్యధికంగా బ్రహ్మానందం అని ఓటు వేశారు.

బ్రహ్మానందం దరి దాపుల్లో కూడా ఎవరు నిలువలేదు.ఇటీవల సినిమాల్లో జబర్దస్త్‌ కమెడియన్స్‌ ఎక్కువగా కనిపిస్తున్నారు.

వారు ఒకటి రెండు సినిమాల్లో నవ్విస్తున్నారు మినహా అంతకు మించి సక్సెస్‌ అవ్వలేక పోతున్నారు.కాని బ్రహ్మానందంకు మాత్రం తన కామెడీతో ప్రేక్షకులను కట్టి పడేయగల సత్తా ఇంకా ఉందని సర్వేలో తేలింది.

ఇప్పటికి అయినా దర్శకులు బ్రహ్మీకి మంచి పాత్రలు ఇవ్వాలని ఫిల్మ్‌ మేకర్స్‌ను కోరుతున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube