విగ్రహ రూపంలో శివుడు ఎక్కడ కొలువై ఉంటాడో తెలుసా?

People Worship Lord Shiva In Statue Instead Of Lingam

శివుని దేవాలయాలు దేశ వ్యాప్తంగా ఎంతో ప్రఖ్యాతి చెందిన దేవాలయాలు ఉన్నాయ్.అయితే శివాలయంలో ఎక్కడికి వెళ్లినా కానీ మనకి లింగరూపంలో దర్శనం కలుగుతుంది.

 People Worship Lord Shiva In Statue Instead Of Lingam-TeluguStop.com

అయితే ఆంధ్రప్రదేశ్ చిత్తూరు జిల్లాలోని సూరుటు పల్లి శివాలయాన్ని తప్పనిసరిగా దర్శించుకోవాలి.ఎందుకంటే ఆ గుడికి ఒక ప్రత్యేకత ఉంది.

అన్ని దేవాలయాల్లో శివుడు మనకు లింగ రూపంలో దర్శనమిస్తే, ఇక్కడ మాత్రం విగ్రహ రూపంలో దర్శనమిస్తాడు.ఈ ఆలయం యొక్క ప్రతిష్ఠత ఏమిటో ఇక్కడ తెలుసుకుందాం.

 People Worship Lord Shiva In Statue Instead Of Lingam-విగ్రహ రూపంలో శివుడు ఎక్కడ కొలువై ఉంటాడో తెలుసా-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

పూర్వం రాక్షసులు, దేవతలు అమృతం కోసం క్షీరసాగర మధనం చేశారు.అయితే అప్పుడు సముద్రం నుంచి హాలాహలం అనే కాలకూట విషం బయటకు వస్తుంది.విశ్వ కళ్యాణార్థం ఆ హాలాహలాన్ని పరమశివుడు సేవిస్తాడు.అయితే దాన్ని తాగితే చనిపోతార అన్న ఉద్దేశంతో ఆ విషాన్ని తన కంఠంలోనే ఉంచుకుంటాడు.

అందువల్ల శివుని కంఠం నీలంగా మారిపోతుంది.అందుకే శివుని నీలకంటేశ్వరడు అని కూడా అంటారు.

హాలాహలం సేవించిన అనంతరం పార్వతీ పరమేశ్వరులు తిరిగి కైలాస పయనం చేస్తారు.వారు పయనిస్తూ ఉండగా సరిగ్గా పల్లి కొండేశ్వర క్షేత్రం వద్దకు రాగానే సాక్షాత్తు ఆ పరమశివుడే విష ప్రభావానికి లోనవుతారు.

స్పృహ తప్పి ఆ పరమేశ్వరుడు సర్వమంగళ స్వరూపిణి అయిన పార్వతి దేవి వడిలో నిద్రిస్తాడు.అయితే శివుని కంఠంలోని విషం తన శరీరం లోకి వెళ్లకుండా పార్వతీదేవి తన కంఠాన్ని గట్టిగా పట్టుకుంటుంది.

ఆ విషాన్ని పార్వతీదేవి అమృతంలా మార్చడం వల్ల పార్వతీ దేవిని అముదాంబిక అని పిలుస్తారు.ఈ అద్భుతమైన సంఘటనలకు విగ్రహ రూపమే ఈ సురుటపల్లి దేవాలయం.

అయితే ఈ ఆలయంలో శివుడు శయనించి దర్శనం ఇవ్వడం వల్ల దీన్ని శివ శయన క్షేత్రం అని కూడా అంటారు.ఈ ఆలయంలో పరమేశ్వరుడు పార్వతీ ఒడిలో నిద్రిస్తున్నటువంటి 12 అడుగుల విగ్రహ దర్శనమిస్తుంది.

విగ్రహం సమీపంలో దేవతలు ఋషులు చుట్టూ నిలబడి శివుని ప్రార్థిస్తున్నట్లు ఉంటాయి.అభిషేక ప్రియుడైన శివునికి ప్రతి 15 రోజులకు ఒకసారి తమిళనాడు నుండి తెచ్చే చందన తైలంతో అభిషేకం చేస్తారు.

#Shiva Ingam #Lord Shiva #Shiva Lingam #Suruttapalli #Andhra Pradesh

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube