ఆ బ్లడ్ గ్రూప్ వాళ్లకు తక్కువగా సోకుతున్న కరోనా వైరస్!

దేశంలో కరోనా మహమ్మారి కోరలు చాస్తోంది.కరోనా బాధితుల సంఖ్య, మృతుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది.

 People With Blood Type O May Have Lower Risk Of Corona Virus Infection Coronavir-TeluguStop.com

కరోనా వైరస్ గురించి, వ్యాక్సిన్ల గురించి పరిశోధనలు జరుగుతుండగా పలు వ్యాక్సిన్లు తుది దశ క్లినికల్ ట్రయల్స్ లో ఫెయిల్ అవుతున్నాయి.దీంతో కరోనా వ్యాక్సిన్ ప్రజలకు అందుబాటులోకి రావడానికి మరింత సమయం పట్టే అవకాశాలు ఉన్నాయని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

తాజాగా శాస్త్రవేత్తలు చేసిన పరిశోధనలో కరోనా మహమ్మారి గురించి ఆసక్తికరమైన విషయం వెలుగులోకి వచ్చింది.వేర్వేరు శాస్త్రవేత్తలు చేసిన అధ్యయనాల్లో ఇతర బ్లడ్ గ్రూప్ లతో పోల్చి చూస్తే ఓ బ్లడ్ గ్రూప్ కు చెందిన వాళ్లు కరోనా బారిన పడే అవకాశాలు తక్కువగా ఉంటాయని తేలింది.

డెనార్క్ శాస్త్రవేత్తలు కరోనా సోకిన 7,422 మంది నుంచి బ్లడ్ శాంపిళ్లను సేకరించి పరిశోధనలు చేసి ఈ విషయాలను వెల్లడించారు.

ఈ పరిశోధనలో కరోనా సోకిన ఏ, ఓ బ్లడ్ గ్రూపులకు చెందిన కరోనా కేసుల సంఖ్య మధ్య ఏకంగా 6 శాతం వ్యత్యాసం ఉందని తేలింది.

కెనడాకు చెందిన శాస్త్రవేత్తలు కరోనా సోకిన వాళ్లలో వెంటిలేటర్లపై ఉన్న రోగుల గురించి పరిశోధనలు చేసి ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.వెంటిలేటర్లపై చికిత్స పొందేవారిలో ఏ, ఏబీ గ్రూపుల వాళ్లు 84 శాతంగా ఉంటే ఓ లేదా బీ గ్రూపులకు చెందిన వాళ్లు 61 శాతంగానే ఉన్నారని శాస్త్రవేత్తలు తెలిపారు.

కెనడా శాస్త్రవేత్తలు చేసిన అధ్యయనంలో పాల్గొన్న మైపిండర్ సైఖన్ ఓ బ్లడ్ గ్రూప్ వారిలో రక్తం తక్కువగా గడ్డ కడుతున్నట్టు గుర్తించామని తెలిపారు.కరోనా సోకితే ఓ బ్లడ్ గ్రూప్ వాళ్లకు కూడా ప్రమాదమేనని.

అయితే మిగతా బ్లడ్ గ్రూపులతో పోలిస్తే కరోనా సోకే అవకాశాలు తక్కువగా, త్వరగా కోలుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని శాస్త్రవేత్తలు వెల్లడించారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube