ఎవ్వరితో రిలేషన్ వద్దు...ఒంటరితనము నాకిష్టం అనుకునే ప్రతి ఒక్కరు ఇది తప్పక చదవండి.! మీ ఆలోచన మారుతుంది.!   People Who Like Being Alone Read Once     2018-10-27   09:28:50  IST  Sainath G

ఒకసారి తొమ్మిది 8ని లాగి లెంపకాయ వేసింది….
ఏడుస్తూ 8 “నన్నెందుకొట్టావని?” 9ని అడిగింది.
“నువ్వు నాకంటే చిన్న. అందుకే కొట్టా..” అని 9 చెప్పింది.

అది వింటూనే, ఎనిమిది 7ని బలంగా ఒక్కటిచ్చింది. 9 చెప్పిన కారణమే చెప్పుకొంది.

అలాగే
ఏడు 6ని,
ఆరు 5ని,
ఐదు 4ని,
నాలుగు 3ని,
మూడు 2ని,
రెండు 1ని లెంపకాయలు వేశాయి.

1కి క్రింద 0 వుంది. 1మాత్రం అలాచేయక ప్రేమగా 0ని తన పక్కన నిలబెట్టుకుంది. 1 విలువ 10 ఐపోయింది. ఇప్పుడు భయపడడం 9 వంతైంది.

జీవితంలో ఎవరో ఒకరు మన ప్రక్కన నిలబడాలి. (వారెవరన్నది ముఖ్యం కాదు.)
భుజం తట్టి చెయ్యి వేసేవారు వుండాలి.
అనుబంధాన్ని మించిన విలువ జీవితంలో లేదు.
మంచి వాళ్ళతో అనుబంధాన్ని అస్సలు వదులుకోకండి.!

ప్రకటన : తెలుగుస్టాప్ వెబ్ సైట్ లో పని చేయుట కొరకు అనుభవజ్ఞులైన తెలుగు కంటెంట్ రచయితలు,రాజకీయ విశ్లేషకులు,సోషల్ మీడియా ఫొటోస్/వీడియోస్ అడ్మిన్స్,వీడియో ఎడిటర్,వీడియో మేకర్స్,లైవ్ రిపోర్టర్ లు కావలెను..మీ వివరాలను telugustop@gmail.com కు మెయిల్ చేయగలరు.