కరోనా వల్ల కోట్ల రూపాయల సరకు ఖాళీ చేసిన పేద భారతీయులు.. ?

తెలంగాణ రాష్ట్రంలో కోవిడ్ కేసులు పెరుగుతున్న సందర్భంలో ఇక్కడి ప్రభుత్వం లాక్‌డౌన్‌ విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే.ఇలా చెప్పాపెట్టకుండా లాక్‌డౌన్ అనడంతో తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఊరుకుంటారా.

 People Who Emptied Crores Of Rupees Of Liquor Due To Telangana Lock Down-TeluguStop.com

భూకంపం వచ్చి తెలవారితే చచ్చిపోతున్నాం అని అనిపించేలా ఉరుకులుపరుగులతో చేతిలో సంచులు పట్టుకుని బయలుదేరారు.

ఎక్కడికని ఆలోచిస్తున్నారా.

 People Who Emptied Crores Of Rupees Of Liquor Due To Telangana Lock Down-కరోనా వల్ల కోట్ల రూపాయల సరకు ఖాళీ చేసిన పేద భారతీయులు.. -Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image-TeluguStop.com

వైన్ షాపులకు, మార్కెట్లకు.దీంతో ఇవన్ని జనంతో కిటకిటలాడి పోయాయి.

ఇదేగాక సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులతో కూడా బస్ స్టేషన్లు, రైల్వే స్టేషన్లు రద్దీగా మారాయి.ఇదిలా ఉండగా మన రాష్ట్రంలో ప్రజలు పక్కోడు చస్తున్నా పైసా తీయరు కానీ, రాష్ట్రంలో లాక్‌డౌన్‌ ప్రకటన వెలువడగానే మద్యం దుకాణాల వద్దకు పరుగులు పెట్టారు.

రేషన్ షాపు వద్ద కాస్త క్యూ ఉంటేనే విసుక్కునే జనం మద్యం దుకాణాల వద్ద మాత్రం గంటలకు గంటలు నిలబడి తమ అవసరాలకు మించి మద్యాన్ని కొనుగోలు చేశారు.ఇక లాక్ డౌన్ ప్రకటన వెలుపడిన అనంతరమే మూడు గంటల వరకే రూ.56 కోట్లు విలువైన మద్యం డిపోల నుంచి దుకాణాలకు సరఫరా అయ్యిందంటే మన రాష్ట్రంలో ఎంతమంది పేదలు ఉన్నారో అర్ధం అవుతుంది.

ఇకపోతే నిన్న ఒక్కరోజే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సుమారు రూ.125 కోట్ల మద్యం అమ్ముడవడం ఆశ్చర్యం.కాగా నిముషం నిముషం ప్రపంచం మారుతుంది.

గమనం మరచి గగనశిఖల గర్వంలో వుంది.ఆటవికం నుంచి అధునికం వరకు మనుషులు పరిగెత్తుతున్నారనడానికి నిదర్శనం ఇదే కదా.!

.

#Telangana #Crores Rupees #Emptied #125Rupees #People

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు