ఎద్దును తీసుకెళ్లాలంటూ సీఎంకు ఫిర్యాదు చేసిన ప్ర‌జ‌లు.. ఎందుకో తెలిస్తే..

మ‌న ఇండ్ల ద‌గ్గ‌ర మ‌న‌కు క‌నిపించే సాధు జంతువుల్లో ఆవులు, ఎద్దులు ఎక్కువ‌గా ఉంటాయి.గ్రామాల్లో అయితే వీటిని ప‌నుల కోసం ఉప‌యోగిస్తే ప‌ట్ట‌ణాల్లో మాత్రం రోడ్ల మీద తిరుగుతుంటాయి.

 People Who Complained To The Cm About Taking The Bull  If You Know Why , Bull, M-TeluguStop.com

అయితే ఇప్పుడు వీటి గురించి ఎందుకా అనుకుంటున్నారా అక్క‌డికే వ‌స్తున్నానండి.ఇప్పుడు ఓ చోట ఎద్దు మీద విప‌రీత‌మైన ఫిర్యాదులు వ‌స్తున్నాయి.

మ‌ధ్యప్రదేశ్ రాష్ట్రంలోని శివపురి జిల్లాలో ఈ విచిత్ర ఘ‌ట‌న చోటు చేసుకుంటోంద‌తి.ఇక్క‌డి ప్రజలకు ఆ ఎద్దు వ‌ల్ల తీవ్ర కష్టం వచ్చి పడింది.

దీంతో దాన్ని భరించలేక చివ‌ర‌కు ఆ రాష్ట్ర సీఎంకే ఫిర్యాదు చేస్తున్నారు.

ఆ ఎద్దుతో వేగలేమ‌ని దాన్ని వెంట‌నే తీసుకెళ్లాలంటూ కోరుతున్నారు.

మ‌రి ఇంత‌లా అది ఏం ఇబ్బంది పెడుతుందో తెలుసుకుందాం.ఈ జిల్లాలోని కొలరాస్ ఏరియాలో ఆ ఎద్దు నానా ఇబ్బందులు పెట్టేస్తోంది.

ప్రజలను కొమ్ముల‌తో భయపెడుతూ బీభ‌త్సం సృష్టిస్తోంది.ఇంకా చెప్పాలంటే ఇళ్లలోకి వ‌స్తూ ప్ర‌జ‌ల‌ను వ‌ణికిస్తోంది.ఇష్టం వ‌చ్చిన‌ట్టు చింద‌ర వంద‌ర చేసేస్తోంది.ఇప్ప‌టికే చాలా మందిని గాయపరిచింది.దాంతో దాన్ని ఎలాగైనా వదిలించుకునేందుకు ఆ పట్టణ వాసులు ఎన్నో సార్లు ప్ర‌య‌త్నించినా ఫ‌లించ‌లేదు.దీంతో వారు చేసేది లేక దాని చేష్ట‌ల‌కు అల‌వాటు ప‌డిపోతున్నారు.

ఇది అదును గా చేసుకున్న ఆ ఎద్దు మ‌రింత రెచ్చిపోయింది.ప‌ట్ట‌ణంలోని ఉండే ఇండ్లు అలాగే కిరాణా షాపుల్లోకి వ‌చ్చి వ‌స్తువుల‌ను పాడు చేస్తోంది.బెదిరిస్తే రివ‌ర్స్ దాడి చేస్తోంది.అధికారులు కూడా దాన్ని కంట్రోల్ చేయ‌డంలో ఫెయిల్ అవుతున్నారు.

కొన్ని సార్లు ఇంటి త‌లుపులు కూడా బ‌ద్ద‌లు కొట్టేసి ఇంట్లో ప‌డుకుంటోంది.దీంతో దానిపై సీఎం హెల్ప్‌లైన్ నెంబర్ 181కి కాల్ చేసి స్థానికులు ఫిర్యాదు చేశారు.

ఎలాగైనా దాని బారి నుంచి కాపాడాలంటూ కోరుతున్నారు.దీంతో రంగంలోకి దిగిన అధికారులు దాన్ని బంధించి దూర ప్రాంతంలో వ‌దిలి పెడతామని హామీ ఇస్తున్నారు.

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube