ఈ భూమిపైన ఏ ఒక్క ఇద్దరి మైండ్ సెట్ ఒకే విధంగా వుండదని మీకు ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.మరి అదే అమ్మాయిలు, అబ్బాయిలు ఆలోచించే విధానంలో అయితే ఇక చెప్పాల్సిన అవసరమే లేదు.
ఖచ్చితంగా చాలా తేడా ఉంటుంది.ఒక విషయం గురించి అమ్మాయిలు ఒకలా ఆలోచిస్తే, అబ్బాయిలు మరోలా ఆలోచిస్తారు అని అనేక సర్వేలలో తేలిందని మీరు వినే వుంటారు.
కాగా ఈ క్రమంలోనే అమ్మాయిల లెక్కలు ఎలా ఉంటాయో వివరిస్తూ ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ పోస్ట్ వైరల్ అవుతోంది.కాగా ఆ వైరల్ పోస్ట్‌పై నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు.
ఓ ట్విటర్ యూజర్ ఈ పోస్ట్ చేయడంతో ఆ పోస్ట్ కాస్త వైరల్ అవుతోంది.“నో యువర్ మీమ్”( Know Your Meme ) పరిశోధన ప్రకారం.కొంత మంది అమ్మాయిల షాపింగ్ అనేది లాజిక్ గా ఇంకాస్త వెరైటీగా ఉంటుందని చెప్పుకొచ్చారు.షాపింగ్ చేసేటపుడు ఐదు డాలర్ల కంటే తక్కువ విలువ కలిగిన వస్తువు మహిళలకు ఉచితంగా అనిపిస్తుందని, 50 డాలర్ల వస్తువును రిటర్న్ ఇచ్చి 100 డాలర్ల వస్తువును కొన్నప్పుడు వారికి కేవలం 50 డాలర్లు మాత్రమే ఖర్చు పెట్టినట్టు ఫీల్ అవుతారని ట్వీట్ చేశారు.
ఈ ఫన్నీ పోస్ట్ చాలా మంది నెటిజన్లను ఆకట్టుకుంది.
కాగా ఈ పోస్ట్ పైన చాలా మంది చాలా ఫన్నీగా రియాక్ట్ కావడం మనం ఇక్కడ చూడవచ్చు.“పుట్టిన రోజు వేడుకల కోసం ఎంత ఖర్చు పెట్టినా అది వృథా కాదని నా గాళ్‌ఫ్రెండ్ చెబుతూ వుంటుంది” అని ఒకరు కామెంట్ చేస్తే, “డబ్బులు ఖర్చు పెట్టే విషయంలో అమ్మాయిలు చాలా ఎమోషనల్‌గా, అబ్బాయిలు చాలా లాజికల్‌గా ఆలోచిస్తారు” అని మరొకరు కామెంట్ చేశారు.అంతేకాకుండా మరికొంతమంది “లెక్కల విషయంలో అమ్మాయిల కంటే అబ్బాయిలు చాలా ఫాస్ట్” అని తమని తాము సపోర్టు చేసుకొని కామెంట్స్ చేశారు.