ప్రజాభిప్రాయం ! బాబు పై తృప్తి .. ఎమ్యెల్యేలపై అసంతృప్తి

ఏపీ అధికార పార్టీ టీడీపీకి సొంత పార్టీ నాయకుల నుంచే ముప్పు ఏర్పడుతోంది.పార్టీని మళ్ళీ అధికారంలోకి తీసుకురావాలని సీఎం చంద్రబాబు అష్ట కష్టాలు పడుతుంటే … పార్టీ నాయకులూ.

 People Trust On Chandrababu Naidu But Not On Tdp Leaders-TeluguStop.com

ఎమ్యెల్యేలు ఆ కష్టాన్ని వృధా చేస్తున్నారు.ముఖ్యమంత్రి పడుతున్న శ్రమను ప్రజలు గుర్తిస్తున్నా.

స్థానిక ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు గత నాలుగేళ్ల నుంచి ప్రజలను దోచుకున్నారని.ఆ ప్రభావం ఇప్పుడు రాబోయే ఎన్నికలపై పడునుందని ఇప్పటికే అనేక సర్వేలు బయటపెట్టాయి.

ప్రజల్లోనూ ఇదే రకమైన చర్చలు సాగుతున్నాయి.ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రజల శ్రేయస్సు కోసం, అభివృద్ధి కోసం నిరంతరం శ్రమ పడుతున్నా…ఆయన శ్రమను పక్కకు నెట్టేరీతిలో ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు వ్యవహరించారు… వ్యవహరిస్తున్నారు.

కొన్ని నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు ప్రజలను ఇబ్బంది పెట్టకపోయినా వారి అనుచరగణం, స్థానిక టిడిపి నాయకులు ప్రజలను, అధికారులను,ఉద్యోగులను వేధించారనే విషయాలు ఇప్పుడు ఒక్కోటిగా బయటపడుతున్నాయి.చంద్రబాబుపై సంతృప్తి ఎమ్మెల్యేలపై అసంతృప్తితో ప్రజలు ఉన్నారని…రాబోయే ఎన్నికల్లో…ఎమ్మెల్యేలపై ఉన్న అసంతృప్తే.ఓట్ల రూపంలో మారుతుం దనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.రాజకీయ చైతన్యం కలిగిన కొన్ని జిల్లాల్లో ఇదే విషయం ఇప్పుడు చర్చనీయాంశమైంది.

ముఖ్యంగా కృష్ణా,గుంటూరు, పశ్చిమగోదావరి, ప్రకాశం,నెల్లూరు తదితర జిల్లాల్లో స్థానిక ఎమ్మెల్యేలు, వారి అనుచరగణం వ్యవహరించిన తీరుపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.నిజానికి కొంత మంది ఎమ్మెల్యేలు వ్యక్తిగతంగా ప్రజలకు మేలు జరిగే పనులు చేసినా.

ఆ ఎమ్మెల్యేలు.దగ్గర ఉండే స్థానిక టిడిపి నాయకులు చేస్తోన్న పనులు నిజమైన టిడిపి అభిమానులకు కూడా అసహనం కలిగిస్తున్నాయి.

నిన్న మొన్నటి వరకు సాధారణ జీవితం గడిపిన టిడిపి నాయకులు గత నాలుగేళ్లలో సంపాదించిన దోపిడీ సొమ్ముతో విలాసవంతమైన జీవితాలకు అలవాటుపడ్డారు.వారి జీవితాల్లో వచ్చిన మార్పులను చూసి వారి వ్యవహారశైలి, ఆహార్యం, చూసిన సాధారణ ప్రజలు, టిడిపి సానుభూతిపరులు కూడా ఆశ్చర్యపోతున్నారు.ఎన్ని కలకు ముందు వరకూ తమలో ఒకడిగా కలిపోయిన వారు ఎమ్మెల్యేలుగా గెలిచిన తరువాత నిన్నమొన్నటి వరకు కలి తిరిగిన కార్యకర్తలు, సానుభూతి పరులు దూరం పెట్టి, దళారులను దగ్గరకు తీయడం మొదలు పెట్టారు.అమాంత వచ్చిన అవినీతి సొమ్ముతో విలాస జీవితం గడపడం ప్రజల్లో ఒకరకమైన దురభిప్రాయం కలుగజేస్తుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube