పబ్లిసిటీ కోసం నోరు జారిన హీరోయిన్‌.. ఆమె ఇంటి ముందు జనాల దర్న  

మలయాళ నటి మంజు వారియర్‌ గురించి తెలుగు ప్రేక్షకులకు పెద్దగా పరిచయం లేదు, కాని మంజు తమిళం మరియు మలయాళంలో పలు చిత్రాల్లో నటించి మెప్పించింది. లేటు వయసులో కూడా హీరోయిన్‌గా ఇంకా కొనసాగుతూనే ఉంది. మంజు వారియర్‌ పెళ్లి తర్వాత కాస్త గ్యాప్‌ తీసుకుని మళ్లీ సినిమాల్లో నటిస్తుంది. ఈమె 18 నెలల క్రితం కేరళలోని ఒక స్లమ్‌ ఏరియాకు వెళ్లింది. అక్కడ ప్రజలు పడుతున్న ఇబ్బందులు చూసి.. అయ్యో మీకు నేను 50 ఇల్లులు కటిస్తాను, మీ అందరిని పక్కా ఇల్లులు ఇప్పిస్తాను అంటూ మాట ఇచ్చింది.

People Trolls And Angry On Manju Warrier About Her Promises-Manju Latest Updates Telugu Viral News Trolls In Social Media

People Trolls And Angry On Manju Warrier About Her Promises

మంజు వారియర్‌ హామీతో అక్కడి జనాలు ఫుల్‌ హ్యాపీ అయ్యారు. కాని ఆమె హామీ ఇచ్చి 18 నెలలు అవుతున్నా కూడా ఇప్పటి వరకు కనీసం ఒక్క ఇటుక కదిలింది లేదు. దాంతో స్థానికులకు ఆగ్రహం కట్టలు తెంచుకుంటుంది. చేతకానప్పుడు ఎందుకు హామీ ఇవ్వాలంటూ ఆమెపై ఆరోపణలు చేస్తున్నారు. మంజు వారియర్‌ తీరుపై ఇప్పటికే ఆగ్రహంతో ఉన్న స్థానికులు త్వరలోనే తమకు కట్టిస్తానంటూ హామీ ఇచ్చిన ఇల్లను వెంటనే కట్టించాలని, లేదంటే ఇంటి ముందు దర్నాకు దిగుతామంటూ చెప్పుకొచ్చారు.

People Trolls And Angry On Manju Warrier About Her Promises-Manju Latest Updates Telugu Viral News Trolls In Social Media

వారి హెచ్చరికతో మళయాల సినీ పరిశ్రమలో చర్చనీయాంశం అవుతుంది. అసలు మంజు వారియర్‌ ఇంత హామీ ఇచ్చి ఎలా మర్చి పోయింది అంటున్నారు. అయితే ఆమె కేవలం పబ్లిసిటీ కోసమే అలా చెప్పి ఉంటుందని, ప్రభుత్వం ఇల్లులు కట్టి ఇస్తే వాటిని తాను కట్టించినట్లుగా కలరింగ్‌ ఇవ్వాలనే ప్రయత్నం చేసిందని కొందరు విమర్శలు చేస్తున్నారు. అయితే మంజు మాత్రం ఇల్లులు కట్టేందుకు ప్రభుత్వంతో చర్చలు కూడా జరిపింది. కాని ఇలా ఎందుకు మద్యలో వదిలేసిందో ఆమెకే తెలియాలి.