బాబు ఓ అడుగు వేశారు.. పవన్ రెండడుగులు వేయాల్సిందే ?  

people talking about janasena new committees Pavan ,janasena, janasenani, TDP, ap, chandrababu ,Jagan, ysrcp ,bjp, somu veeraju - Telugu Ap, Bjp, Chandrababu, Jagan, Janasena, Janasenani, Pavan, Somu Veeraju, Tdp, Ysrcp

టిడిపి అధినేత చంద్రబాబు ఏదో రకంగా పార్టీ నేతల్లో ఉత్సాహం తీసుకువచ్చే విధంగా రకరకాల ప్రయత్నాలు చేస్తూనే వస్తున్నారు.ఆ పోరాటం పోరాటం అంటూ హడావుడి చేస్తూ, ఎప్పుడూ పార్టీ నాయకుల్లో కొత్త ఉత్సాహం తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు  వయసు పైబడుతున్నా, లెక్కచేయకుండా చంద్రబాబు పడుతున్న కష్టం చూస్తుంటే, పార్టీ నాయకులు లోనే కాదు ప్రజల్లోనూ ఆయనపై సానుభూతి వ్యక్తమవుతోంది.

TeluguStop.com - People Talking About Janasena New Committees

పార్టీని పరుగులు పెట్టించేందుకు పూర్తిగా ప్రక్షాళన చేసి, కొత్త కమిటీలను నియమించేందుకు చంద్రబాబు శ్రీకారం చుట్టారు.ఇప్పటికీ పార్లమెంటరీ నియోజకవర్గాల వారీగా ఛార్జీలను నియమించారు.

అలాగే జగన్ ఫ్యాను గాలి లోను ఎదురొడ్డి గెలిచిన వారికి ఇప్పుడు ప్రాధాన్యం బాగానే ఇచ్చారు.వచ్చే ఎన్నికల నాటికి అధికారం దక్కించుకుంటామని బాబు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

TeluguStop.com - బాబు ఓ అడుగు వేశారు.. పవన్ రెండడుగులు వేయాల్సిందే -Political-Telugu Tollywood Photo Image

ఇదిలా ఉంటే ఇప్పుడు చంద్రబాబు చర్యలతో జనసేన పరిస్థితి ఏమిటనే ప్రశ్న అందరిలోనూ తలెత్తుతోంది.పవన్ కు లక్షలాది మంది అభిమానులు వ్యక్తిగతంగా ఉన్నారు.దీంతోపాటు ఏపీలో ప్రధాన సామాజిక వర్గం అండదండ పుష్కలంగా ఉంది.కానీ వారిని పూర్తిగా తమ వైపు తిప్పుకుని రాజకీయం గా పై చేయి సాధించడంలో పవన్ వేస్తున్న వ్యూహాత్మక తప్పటడుగులే ఆయనకు చిక్కులు తెచ్చి పెడుతున్నాయి.2019 ఎన్నికల్లో పవన్ పోటీ చేసిన రెండు చోట్ల ఓటమి చెందారు.

ఈ రెండు ప్రాంతాల్లో పవన్ పట్ల ఆదరణ ఉన్నా, సరైన కసరత్తు చేయకుండా బరిలోకి దిగడం , ప్రత్యర్థులను తక్కువ అంచనా వేయడం, ఇలా ఎన్నో అంశాలతో ఆయన ఓటమి చవిచూడాల్సి వచ్చింది.

ఆయన పార్టీ నుంచి గెలిచిన ఏకైక ఎమ్మెల్యే కూడా ఇప్పుడు రెబల్ గా మారిపోయారు.ఈ తరుణంలో పార్టీ లో నూతన ఉత్సాహం తీసుకువచ్చే విధంగా పవన్ ఎప్పటికైనా వేగంగా ముందడుగు వేయాలి.

గ్రామస్థాయి నుంచి పార్టీని బలోపేతం చేసి 2024 నాటికి బీజేపీతో కలిసి అధికారం పంచుకునే దిశగా అడుగులు వేయాలంటే పవన్ మరింత  దూకుడు పెంచాల్సిన సమయం వచ్చేసింది.ఇప్పటికీ సినిమాలంటూ, హైదరాబాద్ కే పరిమితం అయిపోతే రానున్న రోజుల్లో జనసేన కు రాజకీయ కష్టాలు తప్పవు.

#Pavan #Ysrcp #Janasena #Chandrababu #Jagan

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

People Talking About Janasena New Committees Related Telugu News,Photos/Pics,Images..