ఖాకీల కళ్లలో కారం కొట్టిన కుటుంబం  

People Sprayed Chilli Powder On Police-crime News,police,sprayed

సాధారణంగా దొంగలు పోలీసుల కళ్లలో కారం కొట్టి తప్పించుకుంటారు.కానీ అనకాపల్లి మండలంలో నిజంగానే పోలీసుల కళ్లలో కారం కొట్టారు కొందరు వ్యక్తులు.

People Sprayed Chilli Powder On Police-crime News,police,sprayed Telugu Viral News People Sprayed Chilli Powder On Police-crime News Police Sprayed-People Sprayed Chilli Powder On Police-Crime News Police

దీనికి సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే.అనకాపల్లి మండలం తగరంపూడిలో మద్యం బెల్టు దుకాణం నడిపిస్తున్నారనే సమాచారంతో పోలీసులు దాడులు నిర్వహించారు.

బెల్టు షాపు నిర్వహిస్తున్న కొప్పుల వెంకటలక్ష్మీ అనే మహిళ తన కుటుంబ సభ్యులతో కలిసి పోలీసులపై దాడికి దిగింది.పోలీసులు ఆమె బెల్టు దుకాణంలో మద్యం సీసాలను ధ్వంసం చేశారు.

దీంతో కోపం కట్టలుతెంచుకున్న వెంకటలక్ష్మీ తన భర్త ప్రసాదరావు, తల్లి భూషణ పార్వతి, సోదరుడు చిన్నారావులతో కలిసి దాడులు నిర్వహించిన రూరల్ ఎస్ఐ వెంకటేశ్వరరావుతో పాటు కానిస్టేబుళ్లపై కారం చల్లారు.తమ అక్రమ మద్యం బెల్టు షాపును పోలీసులు ధ్వంసం చేస్తున్నారనే నెపంతో పోలీసుల కళ్లలో కారం కొట్టి వారు అక్కడి నుండి పారిపోయారు.

దీంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.అక్రమంగా మద్యం అమ్మడమే కాకుండా పోలీసుల కళ్లలో కారం కొట్టినందుకు గాను వెంకటలక్ష్మీ కుటుంబం కోసం పోలీసులు గాలిస్తున్నారు.