ఆంధ్ర ప్రదేశ్ లో భూకంపం , పరుగులు తీసిన ప్రజలు

ఏపీలోని ప్రకాశం జిల్లాను భూకంపాల భయం వీడటం లేదు.ఇప్పటికే ఆరు నెలల్లో ఆ జిల్లాలో 12 సార్లు భూ ప్రకంపనలు నమోదయ్యాయి.

 People Ran On Roads In Ap-TeluguStop.com

తాజాగా ప్రకాశం జిల్లాతో పాటు ఆ జిల్లా పొరుగునే ఉన్న శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలోనూ భూమి కంపించింది.

నేటి తెల్లవారుజామున ఈ రెండు జిల్లాల్లో పలు గ్రామాల్లో రెండు సెకన్ల పాటు భూమి కంపించింది.

నెల్లూరు జిల్లాలోని దుత్తలూరు, వరికుంటపాడు మండలాలు, ఉదయగిరి మండలంలోని పలు గ్రామాల్లో భూమి కంపించింది.

ఉన్నట్టుండి భూమి కంపించడంతో ఇళ్లల్లోని జనం ప్రాణభయంతో బయటకు పరుగులు తీశారు.

ఈ భూ ప్రకంపనల కారణంగా జరిగిన నష్టానికి సంబంధించిన వివరాలేమీ వెల్లడి కాలేదు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube