ర‌న్ వే మీద విమానాన్ని నెడుతున్న జ‌నాలు.. ఎందుకో తెలిస్తే

People Pushing A Plane On The Runway If You Know Why

విమానం ఎక్క‌డం అనేది ప్ర‌తి ఒక్కరికి ఎంతో ఇష్ట‌మైన క‌ల‌.కానీ అది అంద‌రికీ సాధ్య‌మ‌య్యే ప‌ని కాదు క‌దా.

 People Pushing A Plane On The Runway If You Know Why-TeluguStop.com

విమానం అన‌గానే గాల్లో ఎగిరేదిగానే మ‌న‌కు తెలుసు.హాయిగా మేఘాల్లో తేలిపోతూ ఉంటే ఆ ఎంజాయ్ మెంట్ అంతా ఇంతా కాదు క‌దా.

కానీ విమానాల‌ను తోయ‌డం మీరెప్పుడైనా చూశార‌.చూడ‌క‌పోతే ఇప్పుడు మేం చెప్ప‌బోయే వైర‌ల్ వీడియోను చూస్తే మీకే అర్థ‌మ‌వుతుంది.

 People Pushing A Plane On The Runway If You Know Why-ర‌న్ వే మీద విమానాన్ని నెడుతున్న జ‌నాలు.. ఎందుకో తెలిస్తే-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఇవాళ రేపు సోష‌ల్ మీడియాలో ఇలాంటి వింత వీడియోలు లేదంటే వైర‌ల్ వీడియోల‌కు ఉన్న క్రేజ్ గురించి మ‌న‌కు తెలిసిందే క‌దా.ఇప్పుడు కూడా ఇలాంటి వీడియోనే హ‌ల్ చ‌ల్ చేస్తోంది.

ఈ వైర‌ల్ వీడియోలో కొంద‌రు మ‌న‌కు విమానాన్ని నెట్ట‌డం క‌నిపిస్తుంది.దీన్ని చూసిన త‌ర్వాత మీలో చాలామందికి ఓ డౌట్ కామ‌న్ గానే వ‌చ్చేస్తుంది.

బైక్ లేదా కారును తోయ‌డం గురించి విన్నాం గానీ ఇలా విమానాన్ని తోయ‌డం ఏంట‌ని మీరంతా కూడా షాక్ అవుతున్నారు క‌దా.కానీ మీరు విన్న‌ది నిజ‌మేనండి బాబు.

ర‌న్ వే మీద ఇలాగే విమానాన్ని తోశారు ప్ర‌యాణికులు.సాధార‌ణంగా రోడ్డు మీద ఆగిపోయిన లారీనీ ప‌క్క‌కు ఎలాగైతే తోస్తారో అలాంటి సంద‌ర్భ‌మే ఇక్క‌డ వ‌చ్చింది మ‌రి.

ఈ వైర‌ల్ వీడియోలో క‌నిపిస్తున్న విమానం స‌డెన్ గా టైర్ పేలిపోయింది.

దీంతో అది టేకాఫ్ కాలేక‌పోయింది.ఇక రన్‌వే మీద‌నే ఉండ‌టంతో మిగ‌తా విమానాలు టేకాఫ్ కావ‌డానికి ఇబ్బందిగా మారింది.ఇక లాభం లేద‌ని కొంద‌రు ప్రయాణికులు, భద్రతా సిబ్బంది కలిసి ఎలాగైనా ఫ్లైట్ ను ప‌క్క‌కు జ‌రిపేందుకు వారంతా రంగంలోకి దిగిపోయారు.

విమానాన్ని ద‌గ్గ‌ర ద‌గ్గ‌ర 30 మంది క‌లిసి ర‌న్ వే మీద నుంచి ప‌క్క‌కు జ‌రిపేయ‌డం ఈ వీడియోలో చూడొచ్చు.ఇక ఈ వీడియో మీద నెటిజ‌న్లు విప‌రీతంగా ట్రోల్ చేస్తున్నారు.

కాగా ఇది నేపాల్ దేశంలో జ‌రిగింది.దీన్ని ఇప్ప‌టికే ల‌క్ష‌లాది మంది చూసి విప‌రీతంగా కామెంట్లు చేస్తున్నారు.

#Plane

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube