ల‌తాజీ త్వర‌గా కోలుకోవాలంటూ ట్విట్ట‌ర్‌ ట్రెండ్‌గా గెట్ వెల్ సూన్‌

తన మ‌ధుర‌మైన‌ గాత్ర మాధుర్యాన్ని ప్రపంచమంతా చాటిన భారతరత్న లతా మంగేష్కర్‌కు లెక్క‌కు మించిన‌ అభిమానులున్నారు.ఈ రోజు ఉద‌యం లతా మంగేష్కర్ కరోనా బారిన పడి, ఆసుపత్రిలో చేరినట్లు సోషల్ మీడియాలో వార్తలు వచ్చినప్ప‌టి నుంచి ఆమె అభిమానులు ట్విట్టర్‌లో ఆమె ఆరోగ్యం కోసం నిరంతరం ప్రార్థిస్తున్నారు.

 People Praying For Lata Mangeshkar Health Get Well Soon, Lata Mangeshkar, Lata-TeluguStop.com

ఇంతేకాదు #GetWellSoon అనేది ఉదయం నుండి ట్విట్టర్‌లో ట్రెండింగ్‌లో ఉంది.లతా మంగేష్కర్ క‌రోనాతో మంగళవారం ముంబైలోని బ్రీచ్ కాండీ హాస్పిటల్‌లో చేరారు.

అక్కడ ఆమెకు చికిత్స‌ కొనసాగుతోంది.ప్రస్తుతం ల‌తాజీలో తేలికపాటి క‌రోనా లక్షణాలు కనిపిస్తున్నాయని వైద్యులు చెబుతున్నారు.

Telugu Corona, Well, Lata Mangeshkar, Latamangeshkar-Latest News - Telugu

మంగేష్కర్ పరిస్థితి బాగానే ఉందని, వయోభారం కారణంగా ఐసీయూలో ఉంచినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.అదే సమయంలో ల‌తాజీ బంధువు రచన మీడియాతో మాట్లాడుతూ.ల‌తాజీ ఆరోగ్యం బాగానే ఉంది.ఆమె వయస్సును దృష్టిలో ఉంచుకుని, జాగ్రత్తలు తీసుకుంటూ ఆమెను ఐసియులో ఉంచారు.అభిమానుల‌ ప్రార్థనలతో ఆమె కోలుకుంటార‌న్నారు.కాగా ల‌తాజీకి న్యుమోనియా సోకిన‌ట్లు ఆమెకు చికిత్స అందిస్తున్న డాక్టర్ ప్రతీక్ సమ్దానీ తెలిపారు.

ప్రస్తుతం ల‌తాజీ.వైద్యుల పర్య‌వేక్ష‌ణ‌లో ఉన్నారు.

ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని డాక్టర్ సమ్దానీ తెలిపారు.కాగా లతా మంగేష్కర్ వయసు 92 ఏళ్లు.1929 సెప్టెంబర్ 28న ఇండోర్‌లో జన్మించిన లత తండ్రి దీనానాథ్ మంగేష్కర్ ప్రముఖ సంగీత విద్వాంసుడు.people praying for lata mangeshkar health get well soon

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube