బాబు హామీలపై జనాభిప్రాయం ఇదీ...!!!  

People Opinion On Chandrababu Naidu Promises-chandrababu Naidu,chandrababu Naidu Promises,elections In Ap,pawan Kalyan Janasena,tdp,ys Jagan

ఎన్నికల వచ్చాయంటే చాలు హామీల వర్షంలో ప్రజలందరూ తడిసి ముద్దయి పోతారు ఒక్క మాటలో చెప్పాలంటే రాజకీయ నేతలు రేపు ఏదో చేస్తారని మాకు ఏదో ఇచ్చేస్తారనే ఊహల్లో విహరిస్తుంటారు. అయితే ఇదంతా గతం గత ఐదేళ్ల పాలనకు ముందు చంద్రబాబు ఇచ్చిన హామీలను నమ్మి తడిసి ముద్దయి పోయిన ప్రజలు ఈసారి అటువంటి పరిస్థితిలో లేరని తెలుస్తోంది. చంద్రబాబు నాయుడు ఏదో చేసేస్తారని జనాలు అనుకోవడం లేదట..

బాబు హామీలపై జనాభిప్రాయం ఇదీ...!!!-People Opinion On Chandrababu Naidu Promises

కానీ చంద్రబాబు గత పాలనను దృష్టిలో ఉంచుకుని ఓటు ద్వారా తమ నిర్ణయాన్ని చెప్పడానికి సిద్ధంగా ఉన్నారనే విషయం మాత్రం స్పష్టంగా అర్థం అవుతోంది

హామీలు ఇవ్వడం లో వాటిని ఎన్నికల సమయంలో మాత్రమే ఒకటి రెండు అమలు చేసి లబ్ది పొందాలని వ్యుహాలు రచించడంలో చంద్రబాబు ని మించిన వారు ఎవరూ లేరు అనేది అందరికి తెలిసిందే. అయ్తీ గతంలో కంటే కూడా. ఈ ఎన్నికల్లో భారీ స్థాయిలో హామీలు ఇచ్చారని అంటున్నారు. అయితే గతంలో ఇచ్చిన హామీల ద్వారానే బాబు గెలిచారు అనేది ఎంత వాస్తవమో, ఈసారి బాబు ఎన్ని హామీలు ఇచ్చిన అధికారం లోకి రారు అనేది కూడా అంతే వాస్తవం అంటున్నారు రాజకీయ పండితులు.

ఎందుకంటే.

ఇంటర్ పూర్తయిన విద్యార్థి కూడా నిరుద్యోగ బత్యం అంటూ హామీలు ఇవ్వడం బాబు మళ్ళీ అధికారం కోసం ఎంతగా పాకులడుతున్నారనే విషయాన్ని స్పష్టంగా ప్రజలకు తెలియజేస్తోంది. ఇక చంద్రబాబు ని ప్రజలు నమ్మని విధంగా ఇచ్చిన ఇంకొక హామీలని పరిశీలిస్తే . జగన్ తన నవరత్నాలలో భాగంగా తీసుకువచ్చిన అమ్మ ఒడి పథకాన్ని కూడా చంద్రబాబు కాపీ కొట్టి దాన్ని తన హామీగా ప్రకటించుకున్నారు.

జగన్ కన్నా ఎక్కువ డబ్బులు ఇస్తాను అంటూ బాబు ప్రచారం చేసుకుంటున్నారు ఇందులో స్పష్టంగా అర్థం అవుతున్న విషయం ఏమిటంటే చంద్రబాబు ఏది సొంతంగా ఆలోచించని, జగన్ ఆలోచనలని మక్కికి మక్కి కాపీ కొడుతున్నారని.

అయితే ఇప్పటివరకు చంద్రబాబు ఇచ్చిన హామీల గురించి ప్రజలు చర్చించుకుంటున్న విషయం ఏమిటంటే. జగన్ ఇచ్చిన హామీలని తిప్పి మళ్ళీ చంద్రబాబు చెప్తున్నారని అంటే జగన్ ఆలోచనలకంటే కూడా బాబు ఎంతో వెనుకపడి ఉన్నారని. జగన్ అయితే అధికారంలోకి వచ్చిన వెంటనే అమలు చేస్తారని కానీ చంద్రబాబుకి అధికారం ఇస్తే ఈ హామీలు అన్నిటినీ 2024 చివర్లో ఎన్నికలు వస్తాయనగా అమలు చేస్తారని అనుకుంటున్నారట. ఎందుకంటే 2014లో ఇచ్చిన హామీలను చంద్రబాబు 2019 చివర్లో అమలు చేసినట్టుగానే ఇప్పుడు హామీలను 2024 లో మళ్లీ అధికారంలోకి వచ్చేముందు అములు చేస్తారని ఫిక్స్ అయిపోయారు జనాలు. అయినా అదేళ్ళలో గుర్తుకురాని మేము చివర్లో గుర్తుకు వచ్చినపుడు మేము మిమ్మల్ని ఎందుకు గుర్తు పెట్టుకోవాలి అంటూ సెటైర్స్ వేస్తున్నారట.