ఉల్లిపాయలకు వెరైటీ పూజలు... సోషల్ మీడియాలో వైరల్  

People Offer Prayers To Onions In Bihar To Protest-indian Market,onion Price,people Offer Prayers To Onions

ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఉల్లిపాయలు ఖరీదు చర్చనీయాంశంగా మారింది.ఉల్లిపాయలు ఖరీదు చూసి భారతీయులందరూ తెగ భయపడుతున్నారు.సామాన్య మధ్య తరగతి ప్రజలు ఉల్లిపాయలు ప్రస్తుతం కొనుక్కుని తినే పరిస్థితుల్లో లేరు.ఒక విధంగా చెప్పాలంటే ఇప్పుడు భారతీయులు బాంబుల కంటే ఉల్లిపాయలను ఎక్కువగా భయపెడుతున్నాయి.

People Offer Prayers To Onions In Bihar To Protest-indian Market,onion Price,people Offer Prayers To Onions Telugu Viral News People Offer Prayers To Onions In Bihar Protest-indian Market Onion Price -People Offer Prayers To Onions In Bihar Protest-Indian Market Onion Price

ఉల్లిపాయలపై సోషల్ మీడియాలో ఈ మధ్యకాలంలో ట్రోల్స్ కూడా విపరీతంగా వస్తున్నాయి.అదే సమయంలో రాజకీయ పార్టీలు కూడా ఉల్లి ధరలు తగ్గించాలని రోడ్డు మీదకు వచ్చి ఆందోళన చేస్తున్నారు.ఇదిలా ఉంటే తాజాగా రెసిడెన్షియల్ హాస్టల్ లోఫుడ్ మెనూలో ఉల్లి దోశలు కూడా బ్యాన్ చేశారు.కొంతమంది షాపింగ్ మాల్స్ లో డబ్బులు వదిలేసి ఉల్లిపాయలు దొంగతనం చేస్తున్నారు.

ఇదిలా ఉంటే తాజాగా ముజఫ్ఫర్ పూర్ నగర్ లో జరిగిన నిరసన ర్యాలీ లో భాగంగా ఆసక్తికరమైన సంఘటన చోటు చేసుకుంది.నిరసనకారులు ఉల్లిపాయలకు దండేసి పూజలు చేశారు.ఇందుకు సంబంధించిన చిత్రాలు సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అదికాస్తా వైరల్ అయ్యాయి.ఉల్లి ధరలు ఆకాశాన్ని అంటుతున్న నేపథ్యంలో వాటిని దైవస్వరూపంగా భావించాలని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.