కరోనా విషయంలో ప్రైవేట్ కంటే ప్రభుత్వ వైద్యానికే ప్రాధాన్యత.. లేటెస్ట్ సర్వే

ప్రపంచ వ్యాప్తంగా కరోనా కేసులు సంఖ్య పెరుగుతూనే ఉంది.దేశంలో కూడా ప్రతి రోజు వేల సంఖ్యలో కరోనా బాధితులు పెరుగుతున్నారు.

 Corona Treatment, Govt Hospitals, Corona Effect, Lock Down, Covid-19, Local Circ-TeluguStop.com

అలాగే చనిపోతున్న వారి సంఖ్య కూడా పెరుగుతుంది.అయితే వాక్సిన్ లేని కారణంగా కరోనాని కట్టడి చేయాలంటే కేవలం భౌతిక దూరం, స్వీయ రక్షణ మాత్రమే సాధ్యం.

కాని అవసరాల కోసం ప్రజలు తప్పక బయటకి వెళ్ళాల్సి అస్తుంది.ఇలాంటి టైంలో ఎన్ని జాగ్రత్తలు తీసుకున్న కరోనా రాదనే గ్యారెంటీ లేదు.

కరోన సోకుతున్న వారిలో మెజారిటీ వర్గం ప్రభుత్వ హాస్పిటల్స్ కి వెళ్తున్నారు.చిన్న సమస్య వచ్చిన ఒకప్పుడు ప్రైవేట్ హాస్పిటల్స్ కి వెళ్లి వేల రూపాయిలు వృద్ధా చేసుకునేవారు.

ఇప్పుడు కరోనా విషయంలో మాత్రం ప్రజల ఓటు ప్రభుత్వ హాస్పిటల్స్ కె ఉందని తాజా సర్వేలో తేలింది.

కరోనా వైరస్ కు చికిత్స విషయంలో ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులు అందిస్తున్న సేవలు, వాటిపై ప్రజల్లో ఉన్న అభిప్రాయాల గురించి లోకల్ సర్కిల్స్ అనే సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ 40 వేల మందిని భాగస్వామ్యం చేస్తూ అధ్యయనం చేసి ఆసక్తికర విషయాలను వెల్లడించింది.

మొత్తం 5 ప్రశ్నలను లోకల్ సర్కిల్స్ సంధించింది.అధ్యయనంలో పాల్గొన్న వారిలో 57 శాతం మంది వైరస్ సోకితే ప్రైవేటు ఆసుపత్రుల్లో అధిక చార్జీల బాదుడును తట్టుకునే శక్తి తమకు లేదని చెప్పడం గమనార్హం.

ఇదే సమయంలో ప్రభుత్వ ఆసుపత్రులకు వెళితే, సెకండరీ కాంటాక్టుల ద్వారా వ్యాధి సోకవచ్చని 46 శాతం మంది ఆందోళన వ్యక్తం చేశారు.ఇక, ప్రైవేటు ఆసుపత్రుల విషయంలో ప్రభుత్వమే ఓ నిర్ణయం తీసుకుని, కరోనా చికిత్సకు కొంత మొత్తాన్ని ఖరారు చేయాలని 61 శాతం మంది కోరారు.

అయితే మెజారిటీ ప్రజలు కరోనా కి ప్రభుత్వ హాస్పిటల్స్ లోనే చికిత్స తీసుకుంటాం అని చెప్పడం గమనార్హం.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube