అలాంటి వాళ్లను చూస్తే పిచ్చ కోపం అంటున్న శృతిహాసన్..?  

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ శృతిహాసన్ ప్రస్తుతం విజయ్ సేతుపతి హీరోగా నటిస్తున్న లాభం అనే సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే.వారం రోజుల క్రితం శృతిహాసన్ షూటింగ్ చూసేందుకు పెద్ద సంఖ్యలో జనం రావడంతో పేకప్ చెప్పి వెళ్లిపోయింది.

TeluguStop.com - People Have Lax About Safety Says Shruti Hasan

శృతిహాసన్ అలా వెళ్లిపోవడంపై నెటిజన్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేశారు.తాజాగా షూటింగ్ నుంచి వెళ్లిపోవడానికి గల కారణాలను తెలియజేస్తూ శృతిహాసన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

కరోనా వైరస్ విజృంభణ నేపథ్యంలోనే తాను ఇంటికి వెళ్లిపోయానని శృతిహాసన్ చెప్పారు.కరోనా బారిన పడకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉంటుందని అన్నారు.షూటింగ్ లకు అనుమతులు లభించిన సెట్ లో అన్ని జాగ్రత్తలతో సినిమా షూటింగ్ ప్రారంభమైందని అయితే రోజులు గడిచే కొద్దీ చాలామంది కరోనా నిబంధనలను పాటించడం లేదని శృతిహాసన్ అన్నారు.ప్రజలు కరోనాను లైట్ తీసుకుంటున్నారని చెప్పారు.

TeluguStop.com - అలాంటి వాళ్లను చూస్తే పిచ్చ కోపం అంటున్న శృతిహాసన్..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image
Telugu Labham Movie Sets, People Negligence, Shruti Hassan Walkout, Vijay Setupati-Movie

చాలామంది కరోనాను సాధారణ జలుబులా భావిస్తున్నారని ఈ వైరస్ బారిన పడితే తీవ్ర ఆరోగ్య సమస్యల వల్ల బాధ పడాల్సి ఉంటుందని పేర్కొన్నారు.ఎవరికి వారు తగిన జాగ్రత్తలు తీసుకుంటే వైరస్ నుంచి మనల్ని మనం రక్షించుకోవడం సాధ్యమవుతుందని పేర్కొన్నారు.రికార్డు స్థాయిలో కేసులు నమోదవుతున్నా కొందరు కనీసం మాస్కులు కూడా సరిగ్గా ధరించడం లేదని అలాంటి వాళ్లను చూస్తే తనకు కోపం వస్తుందని శృతిహాసన్ చెప్పారు.

లాక్ డౌన్ వల్ల సమయం వృథా అయిందని మరో లాక్ డౌన్ కు తాను సిద్ధంగా లేనని తెలిపారు.2021 సంవత్సరంలో కూడా ఒంటరిగానే జీవించాలని అనుకుంటున్నానని.ఈ సంవత్సరం ఒంటరిగా జీవించడం వల్ల ఎన్నో విషయాలను తెలుసుకున్నానని అన్నారు.

లాక్ డౌన్ సమయంలో సంగీతం కొరకు ఎక్కువ సమయం కేటాయించానని.జీవితంపై క్లారిటీ రావడానికి లాక్ డౌన్ తోడ్పడిందని వెల్లడించారు.

#Vijay Setupati #ShrutiHassan

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

People Have Lax About Safety Says Shruti Hasan Related Telugu News,Photos/Pics,Images..