రాహుల్ గాంధీ మీద అసహ్య పడుతున్నారు

డిల్లీ నెహ్రూ విశ్వవిద్యాలయం లో జరుగుతున్న సంఘటనలు దేశానికి పెద్ద మచ్చగా మిగిలే లాగా కనిపిస్తూ ఉన్నాయి.ఎప్పటికైనా తాను ప్రధాని అవ్వడమే తన లక్ష్యంగా కనిపిస్తున్న రాహుల్ గాంధీ ఆయన పార్టీ ఇద్దరూ ఎంత నీచానికైనా దిగాజారగలరు అనడానికి ప్రతీకగా ఇక్కడ వ్యవహారం సాగుతోంది.

 People Hating Rahul Gandhi To Core-TeluguStop.com

కాంగ్రెస్‌ నాయకులు ఎన్ని చవకబారు వేషాలు వేసినా.ఈ దేశ ప్రజలు వారిని సానుభూతితో అర్థం చేసుకోగలరు!

కాంగ్రెస్‌ పార్టీ తీరే అంత అని సరిపెట్టుకోగలరు! కానీ.

ఈ దేశాన్నే పణంగా పెట్టేసే పోకడలు పోతే ఎలా? రేప్పొద్దున్న కాంగ్రెస్‌ వందిమాగధులంతా చేసే భజనలు, అమ్మస్తోత్రాలు ఫలించి.రాహుల్‌ ప్రధాని అయ్యే రోజు గనుక దాపురిస్తే.

ఆయన ఏ దేశాన్ని ఏలుకుంటారు?తెలిసో తెలీయకో రాహుల్ గాంధీ హక్కుల పేరిట ఈ దేశపు ప్రజాస్వామ్యాన్ని కించ పరుస్తూ మాట్లాడుతున్న వారికి మద్దతు పలుకుతున్నారు.అఫ్జల్‌గురు ఉరితీతను వ్యతిరేకిస్తూ జెఎన్‌యూలో జరిగిన సభలో దేశవ్యతిరేక వ్యాఖ్యలు చేసినందుకు విద్యార్థి నాయకుడు కన్హయా కుమార్‌ను అరెస్టు చేసి కేసులు పెట్టారు.

ప్రభుత్వం అంటూ ఉన్న తరువాత.అలాంటి సంఘటన నేపథ్యంలో కనీసం కేసులు కూడా పెట్టకుండా ఏం చేయాలి? చేతులు ముడుచుకుని.మీ ఇష్టం వచ్చినట్లుగా దేశాన్ని తగలెట్టేస్తాం అంటూ ప్రతిజ్ఞలు చేస్తూ కూర్చోండి.మేం ప్రేక్షకపాత్ర వహిస్తూ ఉంటాం.అని చెప్పాలా? అభిప్రాయాలు చెబుతున్నవారి మీద ప్రభుత్వం కేసులు పెడుతోంది అనేది రాహుల్ మాట కానీ అతను గోతికాడ నక్క లాగా దేశం లో ఏ మూలో కార్చిచ్చు రగిలినా కూడా దానిమీద చలి కాల్చుకుందాం అని చూస్తున్నాడు.అతన్ని చూస్తుంటే జనాలు సిగ్గు మాలిన రాజకీయ నాయకుడు గా ఎదుగుతున్నాడు అంటున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube