ఆ గుడిలోకి వెళ్లేందుకు వ‌ణికిపోతున్న జ‌నాలు.. ఏముందో తెలిస్తే

మ‌న దేశంలో గుడుల‌కు ఉన్న ప్రాముఖ్య‌త గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు.మ‌నుషుల‌కు ఏ ఆప‌ద వ‌చ్చినా స‌రే వెంటనే గుడికి వెల్లి ఆ భ‌గ‌వంతుడికి ఒక న‌మ‌స్కారం పెట్టుకుంటూ వేడుకుంటాం.

 People Going To The Temple To Trade If You Know What, Temple, Viral News, Anatap-TeluguStop.com

ఏక‌ష్టం వ‌చ్చినా దాని నుంచి బ‌య‌ట ప‌డేయాల‌ని కోరుకుంటూ ముడుపులు కూడా క‌డుతుంటాం.అది ఏ దేవుడైనా స‌రే క‌నిపిస్తే వెళ్లి క‌నీసం ఒక ప‌ది నిముషాలు అలా గుడిలో కూర్చుని వ‌స్తుంటాం.

కానీ అనంతపురం జిల్లా రోల్ల మండలంలో జేరిగేపల్లి రామజమ్మ ఆలయంలోకి వెళ్లాలంటేనే అక్క‌డి ప్ర‌జ‌లు గ‌జ‌గ‌జ‌గ వ‌ణికిపోతున్నారు.నిజానికి గుడికి వెళ్లాలంటేనే వారి గుండెలదురుతున్నాయి.

మ‌రి వారిని ఇంతలా అక్క‌డ భ‌య‌పెడుతోంది ఏంటా అని ఆలోచిస్తున్నారు.అవేమైనా ద‌య్యాలు గ‌న‌క ఆవహించాయా లేక‌పోతే మరేదైనా అక్క‌డ ఉండి భ‌య‌పెడుతోందా అనేది తెలుసుకునే ప్ర‌య‌త్నం చేయ‌డ‌గా సంచ‌ల‌న విష‌యాలు బ‌య‌ట‌కు వ‌చ్చాయి.

అదేంటంటే కొంద‌రు గుడి ముందు ఏదో నల్లగా తిరుగుతోంద‌ని చెప్తుండ‌గా ఇంకోంద‌రైతే ఏకంగా అదేదో ద‌య్యంలాగా ఉంద‌ని చెప్తున్నారు.న‌ల్ల‌టి ఆకారంలో గుడి తలుపుల ముందు నిలబడి పెద్ద‌గా సౌండ్ చేస్తోంద‌న‌, తలుపులను గట్టిగా నెట్టుతూ అరుస్తోంద‌ని చెప్తున్నారు.

Telugu Anatapuram, Bear Temple, Devils, Forest Officers, Afraid, Temple-Latest N

అయితే రంగంలోకి దిగిన సిబ్బంది, అధికారులు సీసీ కెమెరాల‌ను క్షుణ్ణంగా ప‌రిశీలించ‌గా.అది కాస్తా ఎలుగుబంటి అని తేలింది.ఎలాగోలా గుడిలోకి ప్రవేశించిన ఆ ఎలుగుబంటి గుడి చుట్టూ తిరుగుతోంది.తలుపుల ముందుకు వ‌చ్చి గ‌ట్టిగా నెడుతూ రచ్చ ర‌చ్చ చేస్తున్న‌ట్టు అందులో క‌నిపిస్తోంది.ఆ విధంగా ఆ ఎలుగుబంటి చేస్తున్న ర‌చ్చ మొత్తం ఆలయ ప్రాంగణంలో అమ‌ర్చి ఉన్న సీసీ కెమెరాలో చాలా క్లియ‌ర్ గా రికార్డ్ అయిపోయింది.ఇక ఈ విష‌యం తెలుసుకున్న స్థానికులు భ‌య‌బ్రాంతుల‌కు గుర‌వుతున్నారు.

ఇక ఫారెస్టు ఆఫీస‌ర్ల‌కు వారు స‌మాచారం అందించారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube