అక్కడి ప్రజలు పక్కింటి వారికి ఫ్రీగా సెకండ్ హ్యాండ్ వస్తువులు ఇస్తారు..?

వస్తువులను ఇతరులతో పంచుకోవడం ఒక మంచి పనిగా పెద్దలు ఎప్పుడూ చెబుతుంటారు.చిన్న పిల్లలకు కూడా ఇదే నేర్పిస్తుంటారు.

 People Giving Second Hand Things To Neighbours For Free Details, Germany, Free S-TeluguStop.com

బొమ్మలు చాక్లెట్లు తోటి పిల్లలతో పంచుకోవాలని చెబుతుంటారు.అయితే ‘షేరింగ్ ఈజ్ కేరింగ్’ అనే సామెతను జర్మనీ దేశస్తులు చాలా సీరియస్‌గా తీసుకున్నట్లు కనిపిస్తోంది.

ఎందుకంటే ఇప్పుడు జర్మనీలో సంపన్న కుటుంబాలకు చెందిన వ్యక్తులు తమ సెకండ్ హ్యాండ్ వస్తువులను వారి బంధువులకు ఉచితంగా అందజేస్తున్నారు.

దేశంలోని ప్రజలు తమ పాత వస్తువులను తమ ఇరుగుపొరుగు వారికి కూడా ఫ్రీగా అందిస్తున్నారు.

ఆ పాత వస్తువులు వర్కింగ్ కండిషన్ లో ఉన్నా కూడా వాటిని ఉచితంగానే అందజేస్తున్నారు.ఇలా చేస్తే ఇంట్లో కాస్త ఖాళీ స్థలం ఏర్పడుతుందని.వస్తువును తీసుకునే వ్యక్తి దుకాణం నుంచి అదే వస్తువును కొనుగోలు చేయవలసిన అవసరం లేదని నమ్ముతున్నారు.స్థానిక మీడియా ప్రకారం ఇటీవల బెర్లిన్ నివాసి ఆల్బ్రేచ్ట్ ట్రూబెర్ తన సైకిల్‌ను రిపేర్ చేయించి మరీ పొరుగువారికి ఫ్రీగా అందజేశాడు.

Telugu Hand Items, Germany, Hand Goods-Latest News - Telugu

గార్డెనింగ్ పరికరాల నుండి పిల్లల బొమ్మల వరకు ప్రతి వస్తువును ధనికులు తమ పొరుగు వారికి ఉచితంగా ఇవ్వడం ఇక్కడ ఆనవాయితీగా మారుతుంది.ఈ దేశంలో కార్లు, టెలివిజన్ సెట్లు, స్కూటర్లను కూడా తమ పొరుగువారికి లేదా బంధువులకు ఉచితంగా ఇవ్వడానికి కూడా వెనుకాడని వ్యక్తులు ఉన్నారట.ఈ దేశ ప్రజలు తమ ఉత్పత్తులను nebanan.de అని పిలిచే ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్ ద్వారా పంపిణీ చేస్తున్నారు.

Telugu Hand Items, Germany, Hand Goods-Latest News - Telugu

కేవలం ఏడు సంవత్సరాల క్రితం ప్రారంభించిన ఈ వెబ్‌సైట్ ఇప్పుడు 16 లక్షల మంది వినియోగదారులను కలిగి ఉంది, సుమారు 1 లక్ష మంది వ్యక్తులు క్రమం తప్పకుండా సైట్‌లో చురుకుగా ఉన్నారు.Nebanan.de ఒక్క పైసా కూడా వసూలు చేయకుండా తన ప్లాట్‌ఫామ్ ద్వారా కనెక్ట్ అవ్వడానికి కొనుగోలుదారులు, విక్రేతలను అనుమతిస్తుంది.వెబ్‌సైట్‌ను నిర్వహించడానికి కంపెనీ విరాళాలు, ఛారిటీ డబ్బును ఉపయోగిస్తుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube