హీరో డబ్బులు పంచుతున్నాడని ఎగబడ్డ జనం.. తీరా చూస్తే!  

People Gather In Bhiwandi For Salman Khan Distributing Money - Telugu Bollywood News, Lockdown, Money Distribution, Salman Khan

ప్రస్తుతం నెలకొన్న లాక్‌డౌన్ కారణంగా అనేకమంది తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు.ఇప్పటికే ప్రజలు ఉపాధి కోల్పోయి ఆకలితో అలమటిస్తుంటే కొందరు ముందుకు వచ్చి తమకు తోచిన సాయం చేస్తున్నారు.

 People Gather In Bhiwandi For Salman Khan Distributing Money

అయితే ఈ క్రమంలో కొందరు నిత్యావసర వస్తువులు దానం చేస్తుండగా, మరికొంత మంది అన్నదానం చేస్తూ అభాగ్యులను ఆదుకుంటున్నారు.కాగా ముంబైలో ఓ స్టార్ హీరో డబ్బులు పంచుతున్నాడనే విషయం తెలుసుకున్న జనం, భారీ సంఖ్యలో ఎగబడ్డారు.

బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ భీవండీలో ప్రజలకు డబ్బులు పంచుతున్నాడనే వార్తలు స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.ఈ వార్త నిజమే కావచ్చని వేల సంఖ్యలో ప్రజలు సల్మాన్ ఇచ్చే డబ్బుల కోసం ఎగబడ్డారు.

హీరో డబ్బులు పంచుతున్నాడని ఎగబడ్డ జనం.. తీరా చూస్తే-General-Telugu-Telugu Tollywood Photo Image

అసలే కరోనా వైరస్ కారణంగా సామాజిక దూరం పాటించాలని ప్రభుత్వాలు నెత్తినోరు మొత్తుకుంటుంటే, ఇలాంటి కార్యక్రమాలు ఎలా చేపడతారని పోలీసులు మండిపడ్డారు.దీంతో అక్కడి వచ్చి అసలు విషయం తెలుసుకున్నారు.

కాగా సల్మాన్ ఖాన్ ఎలాంటి డబ్బులు పంచడం లేదని తెలుసుకుని, ఇదంతా కేవలం పుకారే అని ప్రజలకు తెలిపి వారిని అక్కడి నుండి పంపేశారు.

ఇలాంటి వార్తలను ప్రజలను నమ్మవద్దని వారు కోరారు.

కాగా ఇలాంటి తప్పుడు వార్తలను ఎవరు ప్రచారం చేసినా కఠిన చర్యలు తప్పవని వారు హెచ్చరించారు.ఇలా డబ్బుల పంపకం అంటూ పుకార్లు పుట్టించిన వారిని పట్టుకునేందుకు మహారాష్ట్ర పోలీసులు ప్రయత్నం చేస్తున్నారు.

ఏదేమైనా ఈ వార్తతో మరోసారి స్థానికంగా సల్మాన్ ఖాన్ టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారాడు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు